యావత్ దేశం కర్ణాటక ఎన్నికల్ని ఆసక్తిగా ఎదురుచూసింది. అంతకు మించిన ఆసక్తి.. ఉత్కంటతో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఏమవుతుందన్నది చూశారు. రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి ప్రదర్శించని వారు సైతం.. మోడీ ఏమైనా మేజిక్ చేశారా? లేక.. కాంగ్రెస్.. జేడీఎస్ లు ఉమ్మడిగా కలిసి షాకిచ్చారా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు పనులు పక్కన పెట్టి మరీ సాయంత్రం నాలుగు ఎప్పుడు అవుతుందా? అంటూ ఆసక్తిగా ఎదురుచూశారు.
కోట్లాది మంది నరాలు తెగే ఉత్కంటతో తుది ఫలితం ఏం జరుగుతుందోనని ఆందోళన పడుతున్న వేళ.. హైహీట్ జనరేట్ చేసే కర్ణాటక విధాన సభలో.. జరుగుతున్న వాటితో తమకు సంబంధం లేనట్లుగా నిద్రపోయి అందరికి షాకిచ్చారు ఇద్దరు ముఖ్యనేతలు.
వారిలో ఒకరు మాజీ సీఎం సిద్దరామయ్య అయితే.. మరొకరు మాజీ ప్రధాని దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణ. కాంగ్రెస్.. జేడీఎస్ నేతలంతా సీరియస్ గా ఉన్న వేళ.. ఈ ఇద్దరు నేతలు మాత్రం సభలో ఆదమరిచి నిద్రపోవటం చూసి అందరూ ఆసక్తిగా గమనించారు. ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరి నిద్ర గురించి సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న వేళలో అంత హాయిగా ఇద్దరు ముఖ్యనేతలు నిద్రపోవటం చూస్తే.. ఎంతకూ నిద్రపట్టని లక్షలాది మంది కుళ్లు కోవటం ఖాయం. ఎందుకైనా మంచిది.. వారిద్దరూ ఇంటికి వెళ్లి దిష్టి తీయించుకుంటే మంచిదేమో!