అవును నిజమే. అవినీతే సీఎం పదవిని కాపాడింది. ఆయన చేసిన అవినీతి పదవికి ఎసరు తేగా... పార్టీ పెద్దల అవినీతి కుర్చీలో కులాసాగా కూర్చోమని భరోసా ఇచ్చింది. ఇంతకీ ఈ ఆసక్తికర సీఎం ఎవరనుకుంటున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఆయన పదవీచ్యుతికి ఆయన ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించే సూచనలు కరవయ్యాయని చెప్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ఇరుక్కుపోవటం - అయిదు రాష్ట్రాల విధానసభ ఎన్నికల్లో తలమునకలు కావటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. తామెన్నిమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఆశించిన ప్రయోజనం దక్కకపోవటంతో ఆ శిబిరంలో నిరాశ - నిస్పృహలు ఆవరించాయి.
రూ.డెబ్బై లక్షల విలువ చేసే హాబ్లెట్ గడియారం వివాదం శాసనసభను దాటి అవినీతి నిరోధక దళానికి చేరింది. సిద్ధరామయ్య తనయుడి ఆధ్వర్యంలోని ప్రయోగశాల విక్టోరియా ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుకు అనుమతించటం ఇంకా రగులుతూనే ఉంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం...ఆ ప్రయోగశాల అనుమతికి వైద్యవిద్యా మంత్రి డాక్టర్ శరణప్రకాశ్ పాటిల్ తిరస్కరించినప్పటికీ సిద్ధరామయ్య చొరవ తీసుకుని మంజూరు చేయించారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికీ ప్రత్యర్థులు తీసుకెళ్లారు. ప్రయోగశాలను నిర్వహించే సంస్థకు చాలా ఖరీదైన బెంగళూరు అభివృద్ధి ప్రాధికార భూమిని ప్రత్యామ్నాయ స్థలంగా కేటాయించటమూ వివాదాస్పదమైంది. వీటిని పట్టించుకోకుండా సిద్ధరామయ్య కరవు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇలా వివాదాల్లో చిక్కుకున్న రామయ్య పదవి ఊస్టింగనే వార్తలు వినిపించాయి.
ఈ ఎపిసోడ్ లో భాగంగా దళిత నాయకత్వానికి రాజ్యాధికార బదిలీ చేయాలని వాదనలు జోరుగా వినిపిస్తుండటం సిద్ధరామయ్య ప్రత్యర్థుల్లో ఆశల్ని చిగురింప చేసింది. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గేను దళిత నేతలు సిద్ధరామయ్యకు తగిన ఉత్తరాధికారిగా ప్రతిపాదించారు. అయితే ఖర్గేను అక్కడి నుంచి కర్ణాటకకు పంపేందుకు అధిష్ఠానం సిద్ధంగా లేదని తెలిసింది. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన అస్త్రంగా ఆయన్ను పరిగణిస్తున్నారు. అనూహ్య రీతిలో ఖర్గే చేస్తున్న వాదనలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు కూడా సిద్ధరామయ్య పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తీకరిస్తున్నారు. సందర్భోచితంగా నాయకత్వానికి నూరిపోస్తున్నారు.
ఇదిలాఉండగా...ప్రత్యక్షంగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడని సిద్ధరామయ్యను పదవీచ్యుతుని చేస్తే సంభవించే అవాంఛనీయాల్ని నాయకత్వం అంచనా వేస్తోంది. వెనుకబడిన వర్గాలు - అల్పసంఖ్యాకులు - దళితుల ఆదరాభిమానాల్ని చూరగొన్న సిద్ధరామయ్యకు తగిన ప్రత్యామ్నాయ నేత కాంగ్రెస్ లో మరొకరు లేరు. ఆయనంతటి జనాదరణ నేత కూడా కరవు. కేవలం ఆరోపణలతోనే సిద్ధును గద్దె దింపటం అంత తేలిక కాదని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు.