'రెడ్డి' ట్యాగ్‌ తో కాంగ్రెస్ సెటైర్ !

Update: 2018-05-01 11:31 GMT
మోడీ... బీజేపీదే రాజ్యం అని జ‌బ్బ‌లు చ‌రుచుకుంటావు. నీ పార్టీ త‌ర్వాత - నీ గెలుపు మీద నీకే న‌మ్మ‌కం లేక రెండు చోట్ల ఎంపీగా పోటీ చేశావు. మీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌రు అని అడిగితే గ‌ట్టిగా గ‌ర్వంగా చెప్ప‌లేవు. జ‌నాల్ని ఓట్లు ఎలా అడుగుతావు అంటూ కర్ణాట‌క సీఎం అభ్య‌ర్థి సిద్ధ‌రామ‌య్య మోడీపై మాట‌ల దాడి చేశారు.

మీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి యడ్యూరప్ప అని ప‌రోక్షంగా చెప్ప‌డ‌మే మీ నోటి నుంచి చెప్ప‌రు. ఎందుకంటే ఆ పేరు అవినీతికి కేరాఫ్‌. అందుకే ప్ర‌చారంలో మీ వెంట రానివ్వ‌డం లేద‌ని అంటున్నారు. అస‌లు ఆయ‌న మీ సీఎం క్యాండిడేటా కాదా? చెప్పండి మోడీకి ప్ర‌శ్న‌లు సంధించారు. ఈరోజు నుంచి మోడీ క‌ర్ణాట‌క‌లోనే ఉంటున్నారు. బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తారు.  అందుకే ఆయ‌న‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ఈ ప్ర‌శ్న‌లు సంధించింది.

బీజేపీది 2+1 క‌ర‌ప్ష‌న్ ఫార్ములా. 2+1 అంటే 2 రెడ్డీస్ - 1 యెడ్డీ అంటూ ట్విట్ట‌రు అక్కౌంట్ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేసింది. ఎన్నిక‌లు దూరంగా ఉన్న‌పుడు గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి టిక్కెట్లు ఇవ్వం అని చెప్పారు. ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డ్డాక ఆయ‌న‌కు ఫ్యామిలీ ప్యాకేజీ ఇచ్చారు. ఎన్నిక‌ల‌య్యాక మంత్రిని చేస్తారా అంటూ ఆ పార్టీ నిల‌దీసింది. మీకంత న‌మ్మ‌కం ఉంటే బహిరంగ సభలు, ర్యాలీల్లో య‌డ్యూర‌ప్ప‌ను, గాలిని వెంట పెట్టుకుని తిర‌గాల‌ని ఛాలెంజ్ చేశారు.

కర్నాటక ప్రజలకు అన్నీ తెలుసు. వారు చేత‌ల్లో చూపుతారు. వారి చెవుల్లో కమలాలు లేవు అంటూ వ్యాఖ్యానించారు.  అయితే, కాంగ్రెస్ సెటైర్ల‌కు ఇంకా మోడీ బ్యాచ్ నుంచి రిప్ల‌యిలు రాలేదు.
 
Tags:    

Similar News