వైసీపీ నేత‌ల‌తో శిల్పా చ‌క్ర‌పాణి భేటీ

Update: 2017-07-31 17:04 GMT
నంద్యాల ఉప ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది తెలుగుదేశం పార్టీకి ఝ‌లక్‌ ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. మ‌రో నేత తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి ఈ రోజు త‌న సోద‌రుడు, వైసీపీ నంద్యాల ఉప ఎన్నిక‌ల‌ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఆగస్టు 3న వైసీపీ అధినేత జగన్ సమక్షంలో శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తుంది.

ఈ స‌మావేశంతో కొంతకాలంగా ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరబోతున్నారన్న వార్తలను ఎట్టకేలకు నిజమయ్యాయని అంటున్నారు. ఉప ఎన్నిక‌లో పోటీచేసే అవ‌కాశం తెలుగుదేశం పార్టీ త‌మ కుటుంబానికి ఇవ్వ‌నందుకు నిర‌స‌న‌గా చ‌క్ర‌పాణి రెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని అంటున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయిన త‌ర్వాత ఈ చేరిక ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. అది నిజం చేస్తూ శిల్పా చక్రపాణిరెడ్డి
అడుగులు వేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి పార్టీ మార‌కుండా చూడ‌టంలో భాగంగా అధికార టీడీపీ రంగంలోకి దిగింది. అందుబాటులో ఉన్న నేత‌లు శిల్పా చక్రపాణిరెడ్డిని బుజ్జగించే చర్యలకు దిగారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, మంత్రి కాల్వ శ్రీనివాసులు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు రంగంలోకి దిగి చక్రపాణి రెడ్డితో మంతనాలు జరిపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ సంద‌ర్భంగా వారికి నిరాశ‌పూరిత స‌మాధాన‌మే వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. కాగా త‌న సోదరుడితో స‌మావేశ‌మైన అనంత‌రం ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నుంచి వచ్చిన వారికే టీడీపీలో ప్రాధాన్యమిస్తున్నారని మండిప‌డ్డారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తన అనుచరులను బెదిరిస్తున్నారన్నారు. వైసీపీలోకి రావాలని తన అన్న ఆహ్వానించారని, అయితే ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. అభిమానులతో భేటీ అయ్యాక తుది నిర్ణయం తీసుకుంటామని చ‌క్ర‌పాణిరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News