ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో బంగారం.. వెండి ఇప్పుడు వార్తాంశాలుగా మారాయి. భారీ ఎత్తున పెరుగుతున్న ధరలతో కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో బంగారం ధర 10 గ్రాములు రూ.40వేలు దాటేసి కొత్త రికార్డు క్రియేట్ చేస్తే.. తాజాగా కేజీ వెండి ధర ఒక్కరోజులో భారీగా పెరిగిన వైనం ఆసక్తికరంగా మారింది.
తాజాగా వెండి కేజీ ధర రూ.50వేల మార్క్ ను దాటేసింది. చాలా ఏళ్ల తర్వాత వెండి ఇంత భారీ ధర పలికిందని చెప్పాలి. సోమవారం ఒక్కరోజులో కేజీ వెండి ఏకంగా రూ.1700 పెరిగి.. రూ.50,200 ధర దగ్గర ఆగింది. తాజా ఊపు చూస్తే.. రానున్న రోజుల్లో మరింత పెరిగినా ఆశ్చర్యం లేదన్నట్లుగా మారింది. ఉన్నట్లుండి వెండి ధర ఇంతలా పెరగటానికి కారణం ఏమిటి? అన్నది ఒక ప్రశ్న అయితే.. వెండి ధర అంతకంతకూ పెరుగుతుంటే.. బంగారం ధర మాత్రం నిలకడగా సాగటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
బంగారం డిమాండ్ పెద్దగా లేదని.. వెండి డిమాండ్ మాత్రం ఇందుకు భిన్నంగా పెరగటంతోనే ఇప్పుడున్న పరిస్థితి వచ్చినట్లుగా చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్ లో వెండికి డిమాండ్ పెరగటం.. నాణేపు తయారీదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ కూడా వెండి రేటు పెరగటానికి కారణంగా చెబుతున్నారు. ఏడాది క్రితం కూడా కేజీ వెండి రూ.30వేలకు కాస్త అటుఇటుగా ఉన్న పరిస్థితి. అలాంటిది తాజాగా ఆల్ టైం హై అన్న రీతిలో వెండి ధర కేజీ రూ.50వేలు దాటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం (2011) కూడా వెండి ధర భారీగా పెరిగి.. ఒక దశలో కేజీ వెండి రూ.75వేలకు చేరింది. అయితే.. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. ఒకదశలో కేజీ రూ.30వేల తక్కువకు చేరుకుంది. అనూహ్యంగా ఇప్పుడు రూ.50వేలకు పైకు దూసుకెళ్లింది. తాజా ఊపు చూస్తే.. వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.