క‌రుణ‌.. జ‌య‌ల చివ‌రి మ‌జ‌లీలో పోలిక‌లెన్నో!

Update: 2018-08-09 06:38 GMT
రాజ‌కీయ శ‌త్రుత్వం ఎక్క‌డైనా ఉండేది. కానీ.. ముఖ‌ముఖాలు చూసుకునేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌ని శ‌త్రుత్వం చాలా త‌క్కువ‌. అందునా.. త‌న‌ను అరెస్ట్ చేసినందుకు ప్ర‌తిగా అర్థ‌రాత్రి వేళ అరెస్ట్ చేసి మ‌రీ ప్ర‌తీకారం తీర్చుకున్న వైనం భార‌త రాజ‌కీయాల్లో క‌రుణ‌.. జ‌య‌ల మ‌ధ్య‌నే చెప్పాలి. దేశంలోని ఇన్ని రాష్ట్రాలు ఉన్నా.. త‌మిళ‌నాడు రాజ‌కీయ వైరం మాత్రం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించేది. ఇక‌.. ఇప్పుడు అలాంటివేమీ క‌ష్ట‌మేమో.

ఒక‌రి నీడ అంటే మ‌రొక‌రికి ఇష్టం లేని క‌రుణ‌.. జ‌య‌ల జీవితాల్ని త‌ర‌చి చూస్తే.. ఇద్ద‌రి మ‌ధ్య పోలిక‌లు చాలానే క‌నిపిస్తాయి. మ‌రీ.. ముఖ్యంగా జీవితంలో ఆఖ‌రి మ‌జ‌లీలో ఇంచుమించు ఇద్ద‌రిదీ ఒకే తీరులో ఉండ‌టం విశేషం.  

ఆరంభంలో ఇరువురి జీవితాలు ఒకే గురువు నీడ నుంచి రావ‌టం ఒక ఎత్తు అయితే..  వారిద్ద‌రూ సీఎంలు అయ్యే తీరు ఇంచుమించు ఒకేలా ఉండ‌టం కనిపిస్తుంది. అంతేనా.. జీవిత చ‌ర‌మాంకం.. మ‌ర‌ణించిన త‌ర్వాత చోటు చేసుకున్న  ఘ‌ట‌న‌లు ఒకేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.

అన్నాదురై గురువు నీడ నుంచి వ‌చ్చిన క‌రుణ‌.. జ‌య‌లు.. త‌ర్వాతి కాలంలో వేర్వేరు దారులు ప‌ట్ట‌టం తెలిసిందే. త‌మ అధినేత‌లు అనారోగ్యంతో క‌న్నుమూయ‌టంతో వార‌స‌త్వంగా సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఒక‌సారి సీఎం సీటులో కూర్చున్న నాటి నుంచి పార్టీ మీద ప‌ట్టు సాధించిన ఇరువురూ.. తాము క‌న్నుమూసే వ‌ర‌కూ పార్టీని అన్నీ తామైన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం క‌నిపిస్తుంది.

అంతిమ ఘ‌డియ‌ల విష‌యానికి వ‌స్తే.. చిత్రంగా ఇద్ద‌రిదీ ఒకే తీరులో ఉండ‌టం విశేషం. ఇరువురు ఆసుప‌త్రుల్లో చేరిన వారిని మ‌ర‌ణం రోజుల త‌ర‌బ‌డి వారితో దోబూచులాడుకుంది. ఇద్ద‌రూ ఆసుప‌త్రుల్లోనే మ‌ర‌ణించ‌టం.. మ‌ర‌ణించే స‌మ‌యంలో ఒకే త‌ర‌హాలో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకోవ‌టం క‌నిపిస్తుంది.

మ‌ర‌ణించిన త‌ర్వాత ఇరువురి పార్థిప‌దేహాల్ని ఒకే చోట ఉంచారు. రాజాజీ హాలుగా ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ఉంచి.. అనంత‌రం మెరానీ బీచ్ లో ఖ‌న‌నం చేశారు. అంతిమ‌యాత్ర సంద‌ర్భంగా కిలోమీట‌రు దూరానికి ఇరువురికి రెండున్న‌ర గంట‌ల‌కు పైనే ప‌ట్టింది. రాజ‌కీయంగా ఇరువురుది వేర్వేరు దారులే అయిన‌ప్ప‌టికీ.. త‌మిళ‌నాడును పారిశ్రామికంగా ముందు ఉంచ‌టంలో మాత్రం ఈ ఇద్ద‌రు అధినేత‌ల తీరు ఒకేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News