కరోనా వేళ.. యావత్ ప్రపంచం మొత్తం ఒకేలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కంటికి కనిపించని ఒక వైరస్ ప్రపంచాన్ని ఇంతలా ప్రభావితం చేయటం.. వందల కోట్ల ప్రజలు ఇళ్లల్లో బంధీలుగా మారటమే కాదు.. ప్రపంచంలోని దేశాలు దాదాపుగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన ప్రత్యేక పరిస్థితి. కఠినమైన లాక్ డౌన్ మినహా మరో మార్గం లేని నేపథ్యంలో అన్ని దేశాలు కరోనాను కంట్రోల్ చేయటానికి ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి. దీని అమలుతో చక్కటి ఫలితాలు వచ్చినంతనే మురిసిపోయి.. లాక్ డౌన్ ను సడలిస్తున్న వారికి ఊహించని షాకులు తగులుతున్నాయి.
లాక్ డౌన్ నిబంధనల్ని ఎత్తి వేసినంతనే పరిస్థితులు మారిపోవటం.. పాజిటివ్ కేసులు నమోదు కావటం ఎక్కువ అవుతోంది. దీనికి పెద్ద ఉదాహరణగా సింగపూర్ దేశం నిలుస్తుంది. మొత్తంగా చూస్తే విశాఖపట్నం అంత ఉండే ఈ దేశంలో కరోనా వ్యాప్తిని చెక్ పెట్టేందుకు కఠినమైన చర్యల్ని తీసుకుంటున్నారు. 55 లక్షల మంది జనాభాతో ఉండే ఈ సంపన్న దేశంలో కరోనాను కంట్రోల్ చేయటం కష్టం కాదు. ఇందుకు తగ్గట్లే ఆ దేశ ప్రజలు సైతం లాక్ డౌన్ కు సహకరించారు.
కేసుల సంఖ్య తగ్గిపోయి.. కరోనా ముప్పు దాదాపుగా లేదనుకున్న వేళ.. లాక్ డౌన్ నిబంధనల్ని సడలించారు. అంతే.. అప్పటివరకూ నామమాత్రంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవటమే కాదు.. ఒకే రోజులో వెయ్యికి పైగా కేసులు (1111కేసులుగా చెబుతున్నారు) నమోదు కావటంతో ఆ బుల్లి దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే వలస కార్మికులు పనిలోకి రావటం.. వారి కారణంగానే కొత్త కేసులు నమోదైన విషయాన్ని గుర్తించారు.
దీంతో.. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా భౌతికదూరం విషయంలో కొత్త మార్గదర్శకాల్ని తీసుకొచ్చారు. ఎవరైనా భౌతిక దూరం నిబంధనల్ని పక్కాగా పాటించకుంటే..తొలిసారి అలాంటి తప్పు చేసివారికి రూ.23వేలు ఫైన్ విధించనున్నారు. భారీగా జరిమానాలు వడ్డిస్తే.. తప్పులు చేసే వారు ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తారని భావిస్తున్నారు. భయానికి మించిన మందు మరేం ఉంటుందన్నది సింగపూర్ ప్రభుత్వ ఆలోచనగా చెప్పక తప్పదు.