సింగపూర్ ప్రధాని అమరావతికి రావట్లేదా బాబు?

Update: 2016-10-04 10:22 GMT
సింగపూర్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అనుబంధం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. విభజన తర్వాత ఏపీ రాజధాని అమరావతికి అన్నీ తానై అన్నట్లుగా సింగపూర్ సాయం చేస్తుందని చెప్పటమే కాదు.. ఆ దేశ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఎన్ని విమర్శలు.. ఆరోపణలు వస్తున్నా.. బాబు వెనక్కి తగ్గని వైనం తెలిసిందే. సింగపూర్ భాగస్వామ్యంతో అత్యద్భుత అమరావతిని ఆవిష్కరిస్తామని చెప్పటం తెలిసిందే. సింగపూర్ తో పాటు.. జపాన్.. చైనా లాంటి మరికొన్నిదేశాల్ని సైతం ప్రస్తావిస్తూ ఉంటారు.

అమరావతి శంకుస్థాపనకు సింగపూర్ ప్రధానితో పాటు.. జపాన్ అధినేతను కూడా తీసుకొస్తానని చెప్పినా.. వర్క్ వుట్ కాకపోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తన ఐదు రోజుల భారత పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని సోమవారం రాత్రి భారత్ కు వచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ప్రధాని మోడీతో పాటు.. రాష్ట్రపతి తదితర ప్రముఖుల్ని కలవనున్నారు. ఈసందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నయి.

సతీసమేతంగా వచ్చిన సింగపూర్ ప్రధాని లీ హెసైన్ లూంగ్.. ఢిల్లీ పర్యటన తర్వాత రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు వెళ్లనున్నారు. అక్కడ రెండు రోజులు గడపనున్నారు. వారికి.. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారు. అంతా బాగుంది కానీ.. సింగపూర్ తో స్నేహగీతాన్ని ఆలపించే చంద్రబాబు.. ఆ దేశ ప్రధాని దేశంలో అడుగు పెట్టి..ఐదు రోజులు గడుపుతున్న వేళ.. అమరావతికి ఎందుకు పిలవలేదు చెప్మా..?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News