ఓపక్క చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు మళ్లీ పెళ్లి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో.. శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవడం ఆసక్తి రేపుతోంది. శ్రీజ నుంచి విడాకులు తీసుకున్నాక శిరీష్.. భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఐతే పార్టీలో చేరినప్పుడు తప్పితే.. ఆ తర్వాత ఎప్పుడూ వార్తల్లో లేడు శిరీష్. భాజపాలో అతడి పరిస్థితి ఏంటన్నది కూడా బయటికి రాలేదు.
ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి శిరీష్ సడెన్ గా ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పక్కన ప్రత్యక్షమవడం ఆసక్తి రేపుతోంది. ఈ రోజుల్లో నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ దొరకడమంటే అంత సులభమైన విషయమేమీ కాదు. మరి ఆ అవకాశం దక్కించుకున్నాడంటే శిరీష్ కు ఢిల్లీలో కొంచెం ఇన్ ఫ్లూయెన్స్ ఉన్న మాట నిజమే అనుకోవాలి. శిరీష్ ఏ కారణంతో మోడీని కలిశాడో కానీ.. రాజకీయంగా కొంచెం బలం పుంజుకోవడానికి అతను ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి భారతీయ జనతా పార్టీ అతడికి ఎలాంటి అవకాశాలిస్తుందో.. మున్ముందు ఆ పార్టీలో శిరీష్ ఎలాంటి పాత్ర పోషిస్తాడో చూడాలి.