చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొన్నేళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో శిరీష్ భరద్వాజ్ ప్రేమించిన ఆమె ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. తర్వాతి కాలంలో వారి దాంపత్య జీవితం బాగా సాగడం - వారి ప్రేమకు గుర్తుగా ఒక బిడ్డకూడా జన్మించడం జరిగింది! అయితే తర్వాతి కాలంలో ఏమైందో ఏమో కానీ వారిరువురూ విడాకులు తీసుకున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో మార్చి నెలలో శ్రీజకు - వ్యాపారవేత్త కళ్యాణ్ తో పెళ్లి జరిగింది. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఆమె మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కూడా రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం బీజేపీలో చేరి రాజకీయంగా ఎదుగుదలకు మెట్లు వేసుకుంటున్న శిరీష్ భరద్వాజ్... త్వరలోనే అంగరంగ వైభోగంగా రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలొస్తున్నాయి! అందులో భాగంగా ఒక పెద్ద వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/