అమరావతి భూకుంభకోణం..సిట్ దూకుడు..అధికారుల్లో వణుకు

Update: 2020-06-05 08:10 GMT
చంద్రబాబు హయాంలో అమరావతి పేరిట నడిపిన భూదందాను వైసీపీ ప్రభుత్వం తవ్వితీస్తోంది.  ఇప్పటికే దీనిపై వేసిన సిట్ తాజాగా ఓ మహిళా ఉన్నతాధికారిని అరెస్ట్ చేయడంతో ఏపీ అధికార వర్గాల్లో కలకలం రేగింది.

తాజాగా నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్  మాధురి అరెస్ట్ తో అమరావతి గుట్టు బయటపడుతోంది. ల్యాండ్ పూలింగ్ పేరిట అక్రమాలు జరిగినట్టు తేలుతోంది. తప్పుడు రికార్డులు సృష్టించినట్టు మాధురి అరెస్ట్ తో తేట తెల్లమైంది. మాధురి గత ప్రభుత్వం టీడీపీ నేత రావుల గోపాలకృష్ణతో కుమ్మక్కై అక్రమంగా 10 పాట్లను రిజిస్ట్రర్ చేసి కౌలును కూడా 5.26 లక్షలు చెల్లించినట్టు సిట్ విచారణలో తేలింది. నకిలీ రికార్డులు సృష్టించారని సిట్ అధికారులు గుర్తించారు.

ఇక డిప్యూటీ కలెక్టర్ మాధురితోపాటు నాడు పనిచేసిన అధికారులను కూడా సిట్ విచారించబోతోందని తెలుస్తోంది. రైతుల భూములను ఇచ్చేందుకు ఒప్పించిన వారికి బహుమానంగా స్థలాలను అక్రమంగా కొందరికి రిజిస్ట్రేషన్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. మొత్తం 150 ఏకరాల భూ కుంభకోణం జరిగినట్టు సిట్ ఇప్పటివరకు గుర్తించినట్టు సమాచారం.

నాడు టీడీపీ నేతలతో కుమ్మక్కై.. తప్పుడు రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడిన అధికారులు ఇప్పుడు హడలి చస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్ తో తమను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారుల్లో వణుకు మొదలైంది. సిట్ దర్యాప్తులో ఇంకా ఏ అధికారులు పేర్లు వెల్లడిస్తారు? ప్రజాప్రతినిధుల జాతకాలు బయటపడుతాయన్నది ఉత్కంఠంగా మారింది.
Tags:    

Similar News