రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఒక కొలిక్కి రావటం లేదు. ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించటం.. దాదాపు పది బృందాలు తీవ్రస్థాయిలో గాలింపులు జరుపుతున్నా.. దాదాపు 20 మంది వరకు అనుమానితులతో పోలీసులు మాట్లాడినప్పటికి ఈ కేసుకు సంబంధించిన కీలకాంశాలు ఇప్పటివరకూ బయటకు రాలేదు.
అయితే.. ఈ హత్యకు సంబంధించి కొన్ని కీలకాంశాలు తెర మీదకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో వైఎస్ వివేకానందకు.. పరమేశ్వర్ రెడ్డికి మధ్య వివాదాలు ఉన్నాయని.. వివేకా హత్య విషయం బయటకు వచ్చిన నాటి నుంచి ఆయన కుటుంబం మొత్తం అదృశ్యం కావటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో పరమేశ్వర్ రెడ్డి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది. పులివెందుల సమీపంలోని కననూరుకు చెందిన పరమేశ్వర్ రెడ్డి భూవివాదాల్ని తీరుస్తుంటారు. సెటిల్ మెంట్లు చేస్తారన్న పేరుంది. ఒకప్పుడు వివేకాకు అత్యంత సన్నిహితంగా మెలిగిన పరమేశ్వర్ రెడ్డి.. ఇటీవల ఒక వివాదంలో ఎవరి దారి వారిదన్నట్లుగా ఉందని చెబుతున్నారు. వీరి మధ్య గొడవ పెరిగినట్లుగా కొందరు చెబుతున్నారు.
పది రోజుల క్రితం పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మరో పది రోజుల్లో ఒక సంచలనం చూస్తారని చెప్పినట్లుగా చెబుతున్నారు. వివేకా హత్య విషయం బయటకు పొక్కిన నాటి నుంచి ఆయన.. ఆయన కుటుంబం కనిపించకుండా పోయింది. వివేకా హత్య ఒకవైపు వెలుగు చూసిన సమయంలోనే.. పరమేశ్వర్ రెడ్డి కుటుంబం మొత్తం అదృశ్యం కావటంపై అనుమానాలు ఉన్నాయి. ఆయన కోసం పోలీసులు తీవ్ర గాలింపులు చేపడుతున్నారు.