మారే కాలంతో పాటు మనుషులు మారుతుంటారు. వారి వైఖరి మారుతుంటుంది. కానీ.. కమ్యూనిస్టు పార్టీ నేతల మార్పు చూస్తే.. వారంతా ప్రజల నుంచి దూరం జరిగిపోయిన భావన కలగక మానదు. ప్రతి విషయంలోనూ హిందూత్వ భావనల్ని మాత్రమే చూసే కమ్యూనిస్టులు తాజాగా మోడీ సర్కారు ఘనంగా నిర్వహించిన యోగా డేపై విమర్శలు సంధించారు.
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో ప్రజల్ని ఒక దగ్గరకు చేర్చటం నియంతలు చేసేవారంటూ నిప్పులు చెరిగిన ఆయన.. యోగా దినోత్సవంపై కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ ఎజెండా కోసమే యోగాకు ప్రచారం చేశారని ఆరోపించిన ఆయన.. యోగాకు ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలిపిందన్న విషయాన్ని మర్చిపోయే ప్రయత్నం చేశారు.
నిజంగా యోగా కనుక హిందుత్వానికి సింబల్ అయితే.. ప్రపంచం వ్యాప్తంగా 200 పైగా దేశాలు ఎందుకు ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు?
వివిధ మతాల్ని అనుసరించే వారు సైతం యోగాను ఒక అద్భుతమైన సైన్స్ గానే చూస్తున్నారు తప్పించి.. మరోలా కాదన్న విషయం కామ్రేడ్స్ ఎందుకు మర్చిపోతారో అర్థం కాని పరిస్థితి.
ఇక.. యోగాలో కాళ్లు.. చేతులు ఆడించటం.. దీర్ఘంగా శ్వాస తీసుకోవటం లాంటి అంశాల్నిఎద్దేవా చేస్తూ.. కుక్కలు కూడా ఇలాంటివి చేస్తాయని.. యోగాకు సంబంధించిన అన్ని ఆసనాలు వాటిలో చూడొచ్చంటూ నోరు జారారు.
యోగాతో ఆరోగ్యం మరింత మెరుగు అవుతుందని.. మానసిక ప్రశాంతతకు యోగాకు మించింది లేదన్న విషయాన్ని నిపుణులు చెబుతున్నారు.. ఈ కామ్రేడ్‌చీఫ్ అందుకు భిన్నంగా నోరు పారేసుకోవటం ఏమిటన్నది ఒక ప్రశ్న అయితే.. మోడీని విమర్శించే క్రమంలో యోగాను.. యోగా చేసే వారిని తిట్టేసే హక్కు సీతారాం ఏచూరికి ఎవరిచ్చారన్నది పెద్ద ప్రశ్న.
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో ప్రజల్ని ఒక దగ్గరకు చేర్చటం నియంతలు చేసేవారంటూ నిప్పులు చెరిగిన ఆయన.. యోగా దినోత్సవంపై కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ ఎజెండా కోసమే యోగాకు ప్రచారం చేశారని ఆరోపించిన ఆయన.. యోగాకు ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలిపిందన్న విషయాన్ని మర్చిపోయే ప్రయత్నం చేశారు.
నిజంగా యోగా కనుక హిందుత్వానికి సింబల్ అయితే.. ప్రపంచం వ్యాప్తంగా 200 పైగా దేశాలు ఎందుకు ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు