వైసీపీలో టీడీపీ మాజీల పరిస్థితి ఇదా...? కుర్చీ కూడా లేదంట!

Update: 2022-09-20 16:30 GMT
ఏపీలో టీడీపీ దిగిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున అటు నుంచి ఇటు జంపిగ్స్ జరిగాయి. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు నలుగురు వైసీపీ జెండా ఎత్తారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు అయితే చాలా ఈజీగా కండువాలు మార్చేసుకున్నారు. వైసీపీ సైతం తమకు అవసరం ఉన్నా లేకపోయినా టీడీపీని దెబ్బతీయాలన్న ఉద్దేశ్యంతో వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకుంది. మరికొందరికి ఆకర్షించి మరీ ఈ వైపునకు చేర్చుకుంది. ఇలా ఆపరేషన్ చాలా సక్సెస్ ఫుల్ గా సాగిపోయింది.

మరి టీడీపీ నుంచి ఎంతో ఉత్సాహంగా వైసీపీలోకి వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంది. పైగా అధికార పార్టీ కదా. వారి దర్జా వైభోగం ఒక్క లెక్కన వెలిగిపోతోందా అంటే వైసీపీలో కధ భలే తమాషాగా ఉందిట. టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్, పోలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్న నేత. మాజీ మంత్రి అయిన శిద్ధా రాఘవరావు ఇపుడు వైసీపీలో ఎలా ఉన్నారు అన్న చర్చ వస్తే ఆయన తన వ్యాపారాల కోసం వైసీపీ వైపు చేరిపోయారు అని అందరూ అన్న్నారు.

అయితే ఆయన అధికార పార్టీలో చేరిన తరువాత  బిజినెస్ కాదు కదా ఆయన టోటల్ పరిస్థితే అక్కడ దారుణంగా ఉందిట. ఇక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆద్వర్యంలో తాజాగా జరిగిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జిల సమావేశంలో ఎమెల్సీ ఎన్నికల మీద చర్చ జరిగింది. దానికి మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును పిలవకపోయినా ఆయన తానుగానే వెళ్లారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సమావేశం మీద వైసీపీ వాళ్ళు అయిదారు ఫోటోలు పెట్టారు. అయితే ఆ ఫోటోలలో ఎక్కడా శిద్ధా రాఘవరావు కూర్చున్న ఫోటో ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడమే చిత్రం అంటున్నారు. దీంతో ప్రకాశం జిల్లా టీడీపీ వాళ్ళు అయితే శిధ్దా సీన్ ఇదీ వైసీపీలో అంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాలలో ఆ ఫోటోలను పెట్టి ట్రోల్ చేస్తున్నారుట.

టీడీపీలో ఉన్నపుడు పులిలా బతికిన శిద్ధా రాఘవరావు వైసీపీలో ఈ విధంగా అయ్యారేంటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది. మరి ఆయనకు అధికార పార్టీలో ఏం లాభమని వెళ్లి చేరారో కానీ ఇపుడు చూస్తే పొజిషన్ ఎలా ఉందో అన్న చర్చ కూదా తమ్ముళ్ళు పెడుతున్నారు. అపోజిషన్ ని కాదని వెళ్ళిన టీడీపీల మాజీలందరి పొజిషన్ కూడా వైసీపీలో  సేమ్ టూ సేమ్ గా అన్ని జిల్లాల్లో ఉందని అంటున్నారు.

అంటే వీరిని  చేర్చుకోవడం కేవలం టీడీపీని మోరల్ గా దెబ్బ తీయడానికి ఎమోషనల్ గా కూడా బెండ్ అయ్యేలా చేయడానికి తప్పించి నిజానికి వీరికి పదవులు ఇవ్వడానికి కాదు, రేపటి ఎన్నికలలో కూడా వీరికి ఏ మాత్రం ప్రయారిటీ ఇవ్వడానికీ కాదని తేల్చేస్తున్నారు. ఇలా పార్టీ మారి వచ్చిన వారిని వైసీపీ అధినాయకుడు అసలు నమ్మరని, జస్ట్ పొలిటికల్ గేమ్ లో భాగంగానే వారిని అటు నుంచి ఇటు తెచ్చి వాడుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే సైకిల్ దిగేసి ఫ్యాన్ నీడన హ్యాపీగా ఉండవచ్చు అనుకుంటున్న వారందరికీ అక్కడ ఫుల్ గా చమటలు పడుతున్నాయనే అంటున్నారుట. అదండీ మ్యాటర్.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News