ఈ మహిళ ఒక్కరు చాలు అఫ్గాన్లో ఆడోళ్ల పరిస్థితి ఏమిటో తెలియటానికి

Update: 2021-08-17 03:44 GMT
తాలిబన్ల రాక్షసుల వశమైంది అఫ్గానిస్థాన్. ఒకవైపు వారు సంబరాలు చేసుకుంటూ ఉంటే.. మరోవైపు అంతర్జాతీయంగా మాత్రం అందుకు భిన్నమైన ఆందోళన..అలజడి వ్యక్తమవుతోంది. అఫ్గాన్ లోని మహిళల పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటే చాలు.. నిలువెత్తు నరకం అన్నది ఏమిటో అర్థమవుతుంది. వారి భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందన్న మాట పలువురి నోట వింటున్నప్పుడు.. వణుకు పుట్టటం ఖాయం. ఇదిలా ఉంటే. ప్రపంచవ్యాప్తంగా పలువురు అఫ్గాన్ మహిళలకు సంఘీభావంగా.. వారు ఎదుర్కొనే నరకాన్ని తప్పించాలని కోరుతూ.. #AfganWomen హ్యాష్‌ట్యాగ్‌ తో తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు.

తాలిబన్లు ఎంత క్రూరంగా వ్యవహరిస్తారన్న దానికి బోలెడన్ని ఉదంతాలు ఉదాహరణలుగా ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో అఫ్గాన్ మహిళలు పలువురు సోషల్ మీడియా ముందుకువచ్చి.. తమకు ఎదురయ్యే హింస గురించి.. బాధల గురించి వాపోతున్నారు. ఇలాంటి వారిలో 33 ఏళ్ల ఖటేరా అనే మహిళ సోషల్ మీడియా ముందుకు వచ్చి తన ఉదంతాన్ని ఉదాహరణగా చెబుతూ.. అఫ్గాన్ లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పే ప్రయత్నం చేసింది. కన్నీళ్లతో అఫ్గాన్ మహిళల్ని రక్షించాలని వేడుకుంటోంది.

ఘజ్ని ప్రావిన్స్ కు చెందిన ఖటేరా.. అక్కడ పోలీసు అధికారిగా వ్యవహరించేవారు. గత ఏడాది తాలిబన్లు ఆమెను నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు. అనంతరం ఆమె కనుగుడ్లు పెకిలించేవారు. నరకం అంటే ఏమిటో చూపించారు. లక్కీగా ఆమె బతికింది. ఆమెనుహుటాహుటిన భారత్ కు తీసుకొచ్చి ట్రీట్ మెంట్ ఇప్పించటంతో ఆమె బతికిపోయింది. దీంతో గత నవంబరు నుంచి ఆమె భారత్ లోనే ఉంటోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆమెపై దాడి చేసిన  వాళ్లు ఎవరో తెలుసా? తాలిబన్ ముఠాకు నాయకుడిగా వ్యవహరించే ఆమె తండ్రే. అఫ్గాన్లో మహిళల్ని మగాళ్లు చూసే తీరు ఎలా ఉంటుందనటానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఉదంతాలు ఎన్నో కనిపిస్తాయి.

తాలిబన్ల హింస ఎంత ఘోరంగా ఉందటానికి ఆమె ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆమె ఆర్థిక పరిస్థితి కారణంగానే ఆమె బతికి బట్టగట్టగలిగారు మిగిలిన వారి పరిస్థితి అలా ఉండదు. తాలిబన్ల క్రూరత్వం వర్ణించలేనంత ఎక్కువగా ఉంటుందని.. అత్యాచారాలు చేయటం.. బుల్లెట్లను ఒంట్లోకి దింపటం.. చంపేసి కుక్కలకు మాంసంగా వేయటం.. మహిళల్ని పిల్లల్ని కనే యంత్రాలుగా మాత్రమే చూడటం వారికి అలవాటుగా చెబుతారు. టీనేజర్లు.. పెద్దవాళ్లు మాత్రమే కాదు.. చిన్నపిల్లల్ని కూడా వదలని క్రూరత్వం వారి సొంతమని చెబుతుంది ఖటేరా. ఇదంతా వింటున్నప్పుడు అప్గాన్ మహిళల గురించి ఆలోచించేందుకే భయపడే పరిస్థితి ఉంటుందని చెప్పకతప్పదు.
Tags:    

Similar News