ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తాత్కాలికంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అందుకు కారణం అతడి కుటుంబసభ్యులు కరోనా బారిన పడటమే. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తన వాళ్లను చూసుకోవాలి కాబట్టి.. తాను ఐపీఎల్ నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్టు అశ్విన్ పేర్కొన్నాడు. మరోవైపు పలువురు విదేశీ క్రికెటర్లు సైతం భారత్ లో కోవిడ్ ఉత్పాతాన్ని చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే కొందరు దేశం విడిచి వెళ్లిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ భావ్యమేనా? అన్న వాదన కూడా వినిపిస్తున్నది.
కానీ బీసీసీఐ మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ‘అన్ని జాగ్రత్తలు తీసుకొని బయోబబుల్ పద్ధతిలో ఐపీఎల్ నిర్వహిస్తున్నాము. ఇబ్బంది ఏమిటి’ అన్నది బీసీసీఐ వాదన . ఇదిలా ఉంటే రవిచంద్రన్ అశ్విన్ కుటుంబపరిస్థితిపై ఆయన భార్య ప్రీతి ఇటీవల ట్వీట్ చేశారు. కరోనాతో తమ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో ఆమె కళ్లకు కట్టినట్టు వివరించారు. ‘ మా కుటుంబంలో మొత్తం 10 మందికి కరోనా సోకింది. ముందుగా మా పిల్లలకు సోకింది. వాళ్లు తరుచూ ఆడుకొనేందుకు బయటకు వెళ్లేవారు. అలా వెళ్లినప్పుడు వచ్చిందని భావిస్తున్నాం.
ఇక మా కుటుంబసభ్యులు వివిధ ఆస్పత్రుల్లో, ఇళ్లల్లో చికిత్స పొందుతున్నారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకొండి. అవకాశం ఉన్నవాళ్లు వ్యాక్సిన్ తీసుకోండి. ప్రస్తుత విపత్తులో వ్యాక్సిన్ ఒక్కటే మనకు శ్రీరామ రక్ష. కాబట్టి అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి. మా కుటుంబంలో మొత్తం నలుగురు పిల్లలకు కరోనా సోకింది’ అంటూ ప్రీతీ ట్వీట్ చేసింది.
కరోనా టైంలో ప్రీతి ఎంతో బాధ్యతాయుతంగా ట్వీట్ చేసిందని పలువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మరోవైపు ఢిల్లీ, ముంబైలో కరోనా కేసులు విపరీతంగా ఉన్న విషయం తెలిసిందే. తొలుత ఢిల్లీ, ముంబైకే పరిమితమైన కేసులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించాయి. కరోనా రోగులకు బెడ్లు కూడా దొరకడం లేదు. తాజాగా బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయాడు. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. నిర్లక్ష్యం పనికిరాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.