సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఇప్పుడేం చేయనున్నారు?

Update: 2020-03-07 15:30 GMT
పట్టుమని పది మంది కూడా లేని ప్రతిపక్ష సభ్యుల్ని సైతం కంట్రోల్ చేసే విషయంలో అధికార పక్షం ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది. గడిచిన ఐదారేళ్లుగా ఈ తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ప్రతిపక్షాలన్న తర్వాత గొడవ చేయటం.. సభను జరగకుండా అడ్డుకోవటం.. గోల గోల చేయటం.. వెల్ లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం.. ఆందోళనలతో వాతావరణాన్ని హాట్ హాట్ గా మార్చేయటం కామన్.

గతంలో ఇలాంటి వాటిని అధికారపక్షాలు ఓపికతో భరించేవి. ఓర్పుగా నచ్చజెప్పేవారు. ఇప్పుడు అలాంటి సీన్లు కనిపించటం లేదు. నచ్చని వారిపై విరుచుకుపడటమే కాదు.. కాస్త తేడా చేసినా.. సభ నుంచి సస్పెన్షన్ చేసి బయటకు పంపించేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో అలాంటి సీనే రిపీట్ అయ్యింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఆరుగురిని ఒక రోజు పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ వేటు వేశారు.

దీంతో.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు. రేవంత్ అరెస్టుతో మంత్రి కేటీఆర్ దిగా చెబుతున్న ఫాం హౌస్ ఉన్న జాన్వాడ్ కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. తమను సభలో ఉంచకుండా చేసిన ముఖ్యమంత్రికి కాలిపోయేలా.. ఆయన కుమారుడిదిగా ఆరోపణలు చేస్తున్న ఫాంహౌస్ వద్దకు వెళ్లి నిరసన..ఆందోళన వ్యక్తం చేయటం ద్వారా ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని బయటకు వదిలిపెట్టటం కన్నా.. అసెంబ్లీలోనే ఉంచేసి వారి గొడవను భరిస్తే మంచిదన్న భావన సీఎం కేసీఆర్ కు కలిగేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్లానింగ్ ఉందని చెప్పాలి.


Tags:    

Similar News