మార్పు మంచిదే. కానీ.. మార్పుకు సైతం కొన్ని పరిమితులు ఉంటాయి. మార్పును స్వాగతించేవారు ఉన్నట్లే.. దీన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని వారు కొందరుంటారు. మార్పుతో వచ్చే లాభాన్ని గుర్తించే కంటే.. దాని కారణంగా వచ్చే ఇబ్బందుల్నే ఎక్కువగా చూసి భయపడిపోతుంటారు. కాలక్రమంలో మార్పులు చోటు చేసుకున్న ప్రతిసారి దాన్ని స్వాగతించటం అంత తేలికైన విషయం కాదన్న విషయం తెలిసిందే. ఏళ్లకు ఏళ్లుగా..ఆ మాటకు వస్తే దశాబ్దాల తరబడి సాగిన రోటీన్.. రొడ్డుకొట్టుడు పద్దతికి భిన్నంగా.. సమూలంగా మార్పులకు శ్రీకారం చుడితే చోటు చేసుకునే అలజడి అంతా ఇంతా కాదు. తాజాగా అలాంటి పరిస్థితిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెర తీశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వినూత్న పథకాలతో పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్న జగన్మోహన్ రెడ్డి.. కొన్ని విషయాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. తన వాదనను బలంగా వినిపిస్తూ.. దాన్ని అమలు చేసే ప్రయత్నం చేశారు. అందులో ఒకటి ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన. దీనిపై భాషా ప్రేమికుల నుంచి వచ్చిన వ్యతిరేకత అంతా ఇంతాకాదు. తెలుగుని చంపేస్తున్నారంటూ చేసిన రార్దాంతమే కాదు.. కోర్టు కేసులు కూడా ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి.
తెలుగు స్కూళ్లను మండలానికి ఒకటి పెడతామని.. అందులో చదివేందుకు ఆసక్తి ఉన్న వారికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నా.. అదేమీ పెద్దగా వర్కువుట్ కాలేదు. తాజాగా ఏపీలోని స్కూళ్లను.. స్కూలింగ్ విధానాన్ని.. విద్యా బోధనను పూర్తిగా మార్చేయాలన్న పట్టుదలతో ఉన్న జగన్.. తాజాగా ఆరు రకాల స్కూళ్లకు తెర తీసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇప్పటివరకు స్కూళ్ల అన్నంతనే ఎలిమెంటరీ.. హైస్కూల్ రెండే ఉండేవి. ఆ తర్వాతి కాలంలో వచ్చిన అంగన్ వాడీ కేంద్రాలు కూడా వచ్చాయి. తాజాగా వీటన్నింటి స్థానే సరికొత్త విధానాన్ని ప్రకటించారు. కొత్తగా ప్రకటించిన ఆరు స్కూళ్లు ఏమంటే..
1. శాటిలైట్ ఫౌండేషన్
2. ఫౌండేషన్
3. ఫౌండేషన్ ప్లస్
4. ప్రీ హైస్కూల్
5. హైస్కూల్
6. హైస్కూల్ ప్లస్
ఇప్పటివరకు ఉన్న అంగన్ వాడీ కేంద్రాల్ని ఎలిమెంటరీ స్కూళ్లలో కలిపేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే అలజడి మొదలైంది. తాజాగా ఆరు రకాల స్కూళ్లు అంటూ జగన్ తీసుకొచ్చిన కొత్త విధానం టీచర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. ఏళ్లకు ఏళ్లుగా ఒకేలాంటి విద్యాబోధనకు అలవాటు పడిన వారు.. ఈ కొత్త విధానాల్ని జీర్ణించుకోలేని పరిస్థితి. కొత్త విధానంలో ట్రాన్స్ ఫర్లు భారీగా ఉండటమే కాదు.. పని ఒత్తిడి పెరుగుతుందన్న అభిప్రాయం నెలకొంది. ఇప్పటివరకు సాగుతున్న విధానాన్ని మార్చేసి కొత్త పద్దతిని స్వాగతించటం వల్ల వచ్చే ప్రయోజనం ఎలా ఉన్నా.. దాని కారణంగా తమకు తిప్పలు తప్పవన్న భావన టీచర్లలో ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇలాంటి అనుమానాల్ని.. సందేహాల్ని తీర్చటమే కాదు.. కొత్త విద్యా విధానంతో కలిగే ప్రయోజనాలు.. టీచర్ల బాధ్యతలు.. నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా వివరించకపోతే.. మొత్తం వ్యవహారం మొదటికే మోసం రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తాను తీసుకొస్తున్న కొత్త విద్యా విధానంపై ఉన్న అనుమానాల్ని తీర్చాల్సిన బాధ్యతను ఉన్నతాధికారుల మీద పెట్టారు సీఎం జగన్. ఇక్కడున్న ప్రధానమైన సమస్య ఏమంటే.. బాధ్యతను చేపట్టాల్సిన అధికారులు ఏ మాత్రం తప్పు చేసినా.. దానికి సంబంధించిన డ్యామేజ్ జగన్ ప్రభుత్వానికి తప్పదన్న మాట వినిపిస్తోంది. మార్పు మంచిదే కానీ.. సమూల మార్పుల పేరుతో జరిగే ప్రయత్నాలు ప్రభుత్వాన్ని ఏం చేస్తాయన్నది కాలమే డిసైడ్ చేస్తుందని చెప్పక తప్పదు. ‘ఆరు’తో అద్భుతం జరుగుతుందా? ఆగమాగం చేస్తుందో?