తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో ఆరో కరోనా పాటిజివ్ కేసు నమోదైంది. ఇతను కూడా విదేశాల నుండి ఇండియా వచ్చిన వ్యక్తే. కరోనా సోకిన వ్యక్తి బ్రిటన్ వెళ్లి వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా ఇది తెలంగాణలో ఆరో పాజిటివ్ కేసుగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇప్పటివరకూ ఉన్న ఐదు కేసుల్లో ఒక యువకుడికి రికవరీ అవ్వడం తో... అతన్ని గాంధీ ఆస్పత్రి నుంచీ డిశ్చార్జి చేశారు. దాంతో గాంధీ ఆస్ప్రత్రిలోని ఐసోలేషన్ వార్డుల్లో నలుగురికి ట్రీట్‌మెంట్ అందుతోంది.
ఇప్పుడు తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం తో వెంటనే అతన్ని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించి , చికిత్స అందిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకిన ప్రతివారు విదేశాలకి వెళ్లి వచ్చినవారే అని , స్థానికంగా ఉండే వారికి సోకలేదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
కరోనా ప్రభావం భారత్ లో పెరుగుతుంది అని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాళ్లను మూసేసింది. ఈ నెల 31 వరకు ఈ నియమం అమల్లో ఉంటుంది అని తెలిపింది. అలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర క్వారంటైన్ విధానం అమల్లోకి తెచ్చి వచ్చే ప్రతీ ప్రయాణికుణ్నీ వికారాబాద్‌లోని హరిత రిసార్ట్ కి పంపి, అక్కడే 14 రోజులు క్వారంటైన్ చేసి , ఆ తరువాత కరోనా నెగటివ్ వస్తే అప్పుడు బయటకి పంపుతుంది. అయితే , ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కూడా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటం తో ప్రజల్లో ఆందోళన మొదలైంది.