ఇంటి బంధాల్ని సర్వనాశనం చేస్తున్న స్మార్ట్ ఫోన్.. షాకింగ్ నిజాలు

Update: 2022-01-05 08:30 GMT
అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ మనిషిని ఎంతలా ఆగమాగం చేస్తుందో చెప్పే నివేదిక ఇది. మనిషి జీవితంలో భాగమై.. అది లేకపోతే ఏదోఆప్తుడ్ని కోల్పోయినట్లుగా ఫీలయ్యేలా చేసే ఈ దరిద్రపుగొట్టు స్మార్ట్ ఫోన్.. మనిషి జీవితంలో బంధాల్ని ఎంతలా దెబ్బ తీస్తుందన్న విషయాన్ని తాజాగా వెల్లడించింది. అంతేకాదు.. కుటుంబంలోని బంధాల్ని.. అనుబంధాల్ని పాతర వేసేలా చేసే ఈ మాయలాడికి మించిన వ్యవసనం మరొకటి లేనట్లే. మనిషి జీవితాన్ని స్మార్ట్ ఫోన్ ఎంతలా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని సైబర్ మీడియా పరిశోధనలో వెల్లడైంది.

దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే.. మహానగరాలైన కొన్నింటిలో స్మార్ట్ ఫోన్ చేసే ఆరాచకం ఏ స్థాయిలో ఉందో గుర్తించే ప్రయత్నం చేశారు. దేశంలో మహానగరాల దిశగా పరుగులు తీస్తున్న హైదరాబాద్.. బెంగళూరు.. అహ్మదాబాద్.. ఫూణెలలో మానవ సంబంధాలపై స్మార్ట్ ఫోన్ చూపిస్తున్న ప్రభావం ఎంతన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా 1100 మందిని ప్రశ్నించారు.

నలుగురు మనుషులు ఉన్న ఇల్లు గతంలో కేరింతలు కొట్టేలా ఉంటే.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఎవరి ఫోన్ లో వారు.. ఎవరి ప్రపంచం వారిది అన్నట్లుగా మారింది. కష్టసుఖాల్ని గుర్తించే అవకాశాన్ని స్మార్ట్ ఫోన్ నాశనం చేస్తుందన్న విషయాన్ని గుర్తించారు. పక్కన కూర్చున్న వారిని పలుకరించాలన్న ఆలోచన రాకుండా చేసేలా.. ఫోన్ మనుషుల్ని మార్చేసిందని చెబుతున్నారు. మనిషిని స్మార్ట్ ఫోన్ ఎంతలా ఎంగేజ్ చేస్తుందన్న దానికి నిదర్శనంగా ఈ సర్వేలో పాల్గొన్న వారు చెప్పిన ఒక మాట మొత్తం విషయాన్ని ఇట్టే చెప్పేస్తుంది. అదేమంటే.. కరోనాకు ముందు స్మార్ట్ ఫోన్ తో రోజుకు 4.5 గంటలు గడిపితే.. కరోనా తర్వాత ఇది ఏకంగా 6.5 గంటలకు పెరిగిందన్నారు. నివేదికలో వెల్లడైన మిగిలిన అంశాల్ని చూస్తే..

- స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైందని పేర్కొన్నవారు 95%

- పిల్లల్లో ప్రవర్తనా మార్పులు గుర్తించామని చెప్పినోళ్లు 90%

- పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవటం తగ్గిపోయింది.. స్నేహతుల్ని కలవటం మానేశారని చెప్పినోళ్లు 85%

- ఇంట్లో ఉన్నా ఎక్కడో గడుపుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పినోళ్లు 75%

- ఇంట్లోని వారిపై చిరాకుగా ప్రవర్తించటం.. పిల్లలతో గడిపేవిలువైన సమయాన్ని కోల్పోతున్నట్లు చెప్పినోళ్లు 74%


Tags:    

Similar News