పద్దెనిమిదేళ్ల విరామం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీ కార్యవర్గ సమావేశాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి హైదరాబాద్ ను కేంద్రంగా సభలు.. సమావేశాలు.. భారీ బహిరంగ సభ పేరుతో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో పాల్గొనటానికి వచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోడీని స్వాగతం పలకటానికి సీఎం కేసీఆర్ రాకపోవటంపై పలువురు మండిపడుతున్నారు. కేసీఆర్ తీరు ఏ మాత్రం సరిగా లేదని చెబుతున్నారు. ఇలాంటి వేళ.. సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒక నియంతగా అభివర్ణించారు. పేదల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమన్న ఆమె.. రెండు కళ్ల విధానం బీజేపీలో చెల్లుబాటు కాదన్నారు.
హైదరాబాద్ కు వచ్చిన ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ప్రధానమంత్రి వస్తే స్వాగతించటానికి రాకపోవటం రాజ్యాంగాన్ని అవమానించటమేనని స్పష్టం చేశారు. ఆయనో నియంతగా అభివర్ణించిన స్మృతి ఇరానీ.. ''కేసీఆర్ కుటుంబానికి రాజకీయాలంటే సర్కస్ కావొచ్చు. కానీ.. మాకు మాత్రం బాధ్యత. రాజ్యాంగ ఉల్లంఘనకు మారుపేరు ముఖ్యమంత్రి కేసీఆర్'' అంటూ మండిపడ్డారు. వారసత్వ రాజకీయాల్ని బీజేపీ అనుసరించదన్న ఆమె.. కుటుంబ పాలనకు ప్రజలు ఆమోదం తెలపరన్నారు.
రాజ్యాంగ గౌరవాన్ని ఎవరు దెబ్బ తీసినా నియంతే అవుతారని.. ఆ లెక్కన చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎం కూడా నియంతేనని చెప్పారు. రాజ్యాంగపరమైన సంప్రదాయాలనే కాదు.. సంస్క్రాతికమైన సంప్రదాయాలను సైతం ఉల్లంఘనలు ఉల్లంఘిస్తున్నానన్నారు. మోడీ పాలనలో పేదల అభ్యుతి గురించి మాట్లాడిన కేంద్రమంత్రి.. 11 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ ఆందాయన్నారు. బీజేపీ హయాంలో ఎస్సీ.. ఎస్టీల వర్గాల వారిని అత్యవసర సేవల్ని అందిస్తున్నట్లు చెప్పారు. తనకు తోచినట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.