దడ పుట్టించిన పాము దొరికింది.. బీఆర్కే భవన్ సేఫ్

Update: 2021-03-03 05:30 GMT
మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక సచివాలయంలో కలకలం రేపిన పాము ఎట్టకేలకు దొరికింది. మూడు రోజులుగా దీని ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో అక్కడి కార్యాలయాల్లో కొన్నింటికి బీఆర్కే భవన్ కు మార్చటం తెలిసిందే. దీంతో.. బీఆర్కే భవన్ తాత్కాలిక తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా మారింది. మూడు రోజుల క్రితం ఒక పామును భవన ప్రధాన ద్వారం వద్ద చూశారు.

చూస్తుండగానే ఒక కన్నంలోకి వెళ్లిపోయింది. అనంతరం దాని ఆచూకీ లభించలేదు. దీంతో.. ఆ పామునుపట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా ఫలించలేదు. మూడు రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించి.. ఎట్టకేలకు దాని ఆచూకీ లభించింది. పాముదూరిన రంధ్రంలోకి నీళ్లు పోయటం.. పొగ పెట్టటం లాంటివెన్నోచేసిన పాముబయటకు రాలేదు.

చివరకు స్నేక్ రెస్క్యూ సొసైటీకి కబురు పంపారు. దీంతో వారు రంగంలోకి దిగారు. వారికి తోడుగా ఫైర్ సిబ్బంది నిలిచారు. రోజులు గడుస్తున్నా పాము జాడ లభించకపోవటంతో బీఆర్కే భవన్ ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు.. తాజాగా దాని ఆచూకీ లభించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు పాము కనిపించటంతో.. దాన్ని జాగ్రత్తగా పట్టుకొని సంచిలోకి జారవిడిచి తీసుకెళ్లారు. దీంతో.. పాము భయం పోయినట్లేనని చెబుతున్నారు. మొత్తానికి మూడు రోజలుగా కనిపించని పాము దొరకటంతో ఉద్యోగులు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
Tags:    

Similar News