అమీర్ వ్యాఖ్యలు స్నాప్ డీల్ కు లాభమే

Update: 2015-11-28 16:28 GMT
మత అసహనం మీద బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల కారణంగా అమీర్ కంటే ఎక్కువగా స్నాప్ డీల్ కు నష్టం వాటిల్లినట్లుగా అందరూ భావించారు. కానీ.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెబుతున్నారు. స్నాప్ డీల్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసుకోవటం.. అమీర్ మీద నిరసన తెలపటం లాంటి చర్యలతో స్నాప్ డీల్ యాప్ ర్యాకింగ్ ఒక్కరోజులో భారీగా పడిపోయింది.

దీంతో. స్నాప్ డీల్ అలెర్ట్ అయిన.. అమీర్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని. తమది యువ భారతీయులు నిర్మించిన కంపెనీగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమీర్ వ్యాఖ్యలతో స్నాప్ డీల్ కు భారీగా దెబ్బ పడినట్లుగా వస్తున్నట్లు పలువురు అంచనాలకు భిన్నంగా పరిస్థితి మారిపోయింది. అమీర్ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చిన రోజున స్నప్ డీల్ ర్యాంకు పడిపోయినప్పటికీ.. నాలుగు రోజుల వ్యవధిలో పడిపోయిన ర్యాంకు నుంచి మెరుగైన ర్యాంకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

అమీర్ వ్యాఖ్యల కారణంగా స్నాప్ డీల్ ర్యాంకు 27కు పడిపోతే.. నాలుగు రోజుల వ్యవధిలో ఈ ర్యాంకు కాస్త 22కు చేరుకోవటం గమనార్హం. తొలుత అమీర్ కు వ్యతిరేకంగా జరిగితే.. ఆపై అమీర్ వివరణ.. అమీర్ అభిమానులు పోటీ కార్యక్రమం షురూ చేయటంతో పాటు.. స్నాప్ డీల్ యాజమాన్యం ఇచ్చిన ‘దేశీ బ్రాండ్’ అన్న మాట కూడా లాభం చేసిందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా అమీర్ కారణంగా ఒకట్రెండు రోజులు స్నాప్ డీల్ ఒడిదుడుకులకు లోనైనా.. సర్దుకొని బిజినెస్ దూసుకుపోవటం గమనార్హం.
Tags:    

Similar News