సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత ఎవరు.. ఎప్పుడు.. ఎలా ఫేమస్ అవుతారో ఎవ్వరూ చెప్పలేకున్నారు. తమకు తెలియకుండానే కొందరు ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతున్నారు. ఆ విధంగా ఫేమస్ అయిపోయింది ఓ యువతి. కేవలం కొన్ని సెకన్ల నిడివి కలిగిన వీడియోలో.. ఓ యువతి గ్రామీణ పద్ధతిలో చేతిలోనే చపాతీలు రోల్ చేస్తూ, కట్టెల పొయ్యిపై కాలుస్తూ ఉంటుంది. ఇలా ఆమె చపాతీ తయారు చేస్తుండగా తీసిన వీడియోలో సన్నటి స్మైల్ ఇస్తుంది.
అక్కడ పడిపోయారు జనాలు. అమ్మాయి నవ్వితే ఆ లెక్కే వేరు. అందునా.. మరీ అందమైన అమ్మాయి నవ్వితే.. ఇక అంతే! ఈ వీడియోలనూ అదే జరిగింది. చపాతీలు తయారు చేస్తూ ఈ యువతి ఇచ్చిన స్మైల్ కు అందరూ ఫిదా అయిపోయారు. ఆ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేశాయి. అంతేకాదు.. ఆ యువతి ఎవరా..? అని తెలుసుకునేందుకు గూగుల్ తల్లిని సైతం ప్రార్థించారు. ఈ క్రమంలో.. మీడియాకు సైతం ఈ విషయం పాకడం.. వాళ్లు రంగంలోకి దిగి.. ఆ యువతి ఎవరనేది కనిపెట్టడం జరిగిపోయింది.
ఇంతకీ ఆమె ఎవరంటే.. పేరు అమీనా రియాజ్. పాకిస్తాన్ కు చెందిన యువతి. వయసు 15 సంవత్సరాలు. కరాచీలో నివసిస్తోంది. సంచార తెగకు చెందిన ఈ యువతి.. తన కుటుంబం నిత్యం ఇలా చపాతీలు చేస్తూ ఉంటుంది. సంచార జీవనం కాబట్టి.. పొయ్యి మీదనే చపాతీలు కాలుస్తుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఆమె వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే.. వెంటనే ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ అమ్మాయి నవ్వుకు అందరూ ముగ్ధులైపోయారు. దీంతో.. వరల్డ్ ఫేమస్ అయిపోయింది అమీనా. మీడియా ప్రతినిధులు ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే.. వీడియోలో కనిపించేందుకు ఆమె ఫ్యామిలీ నిరాకరించినట్టు సమాచారం.
అయితే.. అమీనా రియాజ్ కు మాత్రం ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్ ఉంది. అంతేకాదు.. ఆమెకు ఏకంగా 3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో ఆమె కూరగయాలు కట్ చేస్తున్న ఫొటోలు, వంట చేస్తున్న వీడియోలు పోస్టు చేస్తూ ఉంటుంది. ఆమె ముగ్ధ మనోహర రూపానికి ఫిదా అయిపోయిన ఎంతో మంది నెటిజన్లు ఫ్యాన్స్ గా మారిపోతున్నారు.
ఇదే విధంగా.. గతంలోనూ మరో యువత్ రూపొందించిన వీడియో నెటిజన్లను ఊపేసింది. ఈమె కూడా పాకిస్తాన్ కు చెందిన యువతే కావడం విశేషం. ఆమె పేరు దనానీర్. ఆమె రూపొందించిన కేవలం 4 సెకన్ల వీడియో.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. ఆ వీడియోలో దనీనార్ చేతితో మొబైల్ కెమెరా పట్టుకుని ‘ఇది నా కారు’ అని తన కారును చూపిస్తుంది. ఆ తర్వాత ‘ఇది మేము’ అంటూ స్నేహితులను చూపిస్తుంది. తర్వాత ‘ఇక్కడ మా పార్టీ జరుగుతోంది’ అని వారు చెబుతారు. ఫ్రెండ్స్ తో కలిసి చేసిన వీడియో.. సోషల్ మీడియాలో దూసుకుపోయింది.
‘మీమ్స్’ తో రూపొందిన ఈ వీడియోను రూపొందించిన దనానీర్.. పాకిస్తాన్‌లోని పెషావర్ వాసి. ‘కంటెంట్ క్రియేటర్’ అయిన దనానీర్.. మేకప్, ఫ్యాషన్ డిజైన్ల నుంచి మొదలు అనేక విషయాలపై వీడియోలు చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు దాదాపు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో వైరల్ అయిన తర్వాత దనానీర్ ఫాలోవర్ల సంఖ్య 2 లక్షలు దాటడం గమనార్హం. #PawriHoRahiHai హ్యాష్‌ట్యాగ్ ఫుల్ ట్రెండ్ అయిన ఈ వీడియోను.. భారత్ తోపాటు చాలా దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా షేర్ చేశారు.
Full View