డ్రగ్స్ దందాలో ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పట్టుబడ్డారు. లక్షలకు లక్షలు సంపాదించే ఐటీ ఉద్యోగులు డ్రగ్స్‌కేసులో పట్టుబడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. గోవా, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే ఈ దందాలో ఇంకెంతమంది ఉన్నారు అనే విషయం విచారణలో తేలనున్నది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మౌలాలిలోని ఆర్టీసీ కాలనీకి చెందిన శివసేనారెడ్డి (27), వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన మేకసాయి విపిన్ (27), ఘట్కేసర్ పోచారంలోని సింగపూర్ టౌన్‌షిప్‌కు చెందిన హర్షవర్ధన్ మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీళ్లు ఈజీ మనీకోసం అలవాటుపడ్డారు. వీళ్లు గోవా, విశాఖపట్టణం నుంచి డ్రగ్స్‌ను తెప్పించుకొని హైదరాబాద్‌లో అమ్ముతున్నారు. గురువారం తార్నాక వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా వీళ్ల వద్ద డ్రగ్స్ పట్టుబడింది. 150 మైక్రోగ్రాములు 56 ఎల్ఎస్డీ బ్లాట్స్, 12 గ్రాముల చొప్పున రెండు హషిష్ ఆయిల్ సీసాలు లభ్యమయ్యాయి.
ఎల్ఎస్డీ బ్లాట్స్ను గోవా, విశాఖపట్టణం నుంచి తెప్పిస్తున్నామనీ.. ఒక్కో దానిని రూ. 2 వేలకు తీసుకొచ్చి.. ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు నిందితులు పోలీసులకు తెలిపారు. హర్షవర్ధన్ నుంచి హషిష్ ఆయిల్ ( గంజాయి ఆకులతో తయారుచేసే ఆయిల్) ను కొనుగోలు చేసినట్టు సాయి విపిన్ ఒప్పుకున్నాడు. ఒక్కో సీసాను రూ. 2,500 వాటిని తిరిగి రూ. 4 వేలకు అమ్ముతున్నట్లుగా చెప్పాడు.