నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కట్టే భవనాలన్నీ కనీసం 40 అంతస్తులు ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన. ఇక్కడి భూమి లూజ్ సాయిల్ కనక అన్ని అంతస్తులు కట్టలేరనేది కొంతమంది వాదన. ఈ ప్రాంతం భూకంప జోన్ మూడులో ఉంది కనక భారీ భవన నిర్మాణాలు పనికి రావన్నది మరికొంతమంది సన్నాయి నొక్కులు. మరి, ఈ సమస్యను అధిగమించడం ఎలా? అందుకే నవ్యాంధ్ర ప్రాంతంలో భూమిని మదింపు చేస్తున్నారు సీఆర్ డీఏ అధికారులు.
సీడ్ కేపిటల్ లోని భూమి స్వరూప స్వభావాలను పూర్తిగా తెలుసుకునేందుకు సర్వే మొదలుపెట్టారు. భూమి స్వభావాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగానే వివిధ నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నారు. దాదాపు కిలోమీటరుకు ఒకటి చొప్పున సీడ్ కేపిటల్ లోని అన్ని ప్రాంతాల్లోనూ సర్వేచేసేలా పాయింట్లను గుర్తించారు. మొత్తం సీడ్ కేపిటల్ లో 26 చోట్ల సర్వేలు చేయనున్నారు. ఒక్కొక్క చోట ఈ బృందాలు 15 మీటర్ల లోతు వరకు అధునాతన యంత్ర పరికరాలు పంపి, వేర్వేరు పొరల్లో భూమి స్వరూప స్వభావాలను తెలుసుకుంటారు. దీని ఆధారంగా ఎక్కడెక్కడ భారీ నిర్మాణాలు చేపట్టవచ్చు.. ఎక్కడ ఓ మాదిరి భవనాలు నిర్మించవచ్చనే విషయాలను నిర్థారిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను అధునాతన సాంకేతికతతో చేస్తున్నారు కనక విమర్శలకూ ఆ తర్వాత స్థానం ఉండదనేది ప్రభుత్వ యోచన.