భారత్- చైనాల మధ్య సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌లోని బార్డర్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది ఇండియా. లడఖ్ వద్ద గాల్వన్ లోయలో కొన్నిరోజుల కిందట భారత్, చైనా బలగాల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలు ప్రాణనష్టానికి దారి తీశాయి. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు మరణించినట్టు సైన్యం తెలిపింది.
మహారాష్ట్ర మాలేగావ్ కు చెందిన సచిన్ విక్రమ్ కు గల్వాన్ ఘర్షణలో తీవ్ర గాయాలయ్యాయి. సచిన్ మోరే స్వస్థలం మహారాష్ట్రలోని మాలేగావ్ తాలూకా సాకురి గ్రామం. లేహ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన గురువారం అమరుడయ్యారు. జూన్ 15 రాత్రి తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా దేశాల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఈ రోజు మరణించిన జవాన్ తో కలిపి మొత్తం 21 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా వైపు కూడా ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రరూపం తాల్చాయి. లద్దాఖ్ సరిహద్దుల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి.