కోట్లాది మంది కూటికి లేక పస్తులుంటుంటే పొద్దున్న తాగే టీ కోసమే రూ.3 లక్షలు ఖర్చు చేసే కుబేరులున్న దేశం ఇది.
ఒంటిపై ఉన్న చీర మురికిపట్టో - చినిగిపోయే ఇంకోటి మార్చుకోవాలన్నా కూడా ఆ ఇంకో చీర లేని కటిక పేదలు కన్నీరు కారుస్తుంటే కాళ్లకు వేసుకునేందుకు 5 వేల చెప్పుల జతలు మెంటైన్ చేసే మహారాణులున్న లోకమిది.
పెళ్లాంబిడ్డల సంతోషాలను కూడా పక్కకు పెట్టి వారమంతా ఉద్యోగం చేసి 20 వేలో 30 వేలో సంపాదించి దానికి రూపాయి కూడా తేడా రాకుండా పన్ను కట్టే ఉద్యోగులున్న ఈ దేశంలోనే... లక్షల కోట్లు సంపాదించినా లక్ష రూపాయలు కూడా పన్ను కట్టని బడాబాబులున్నారు.
పేదధనిక తారతమ్యాలు.. ఆర్థిక అసమానతలు ఈ స్థాయిలో ఉన్న దేశానికి చికిత్స చేయాలంటే సాధారణ గోళీ మందు పనిచేయదు... సూది మందు కూడా నిరుపయోగమే.. క్యాన్సర్ లా వ్యాపిస్తున్న నల్లధన సమస్యతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న దశలో రేడియేషనే సరైన చికిత్స. క్యాన్సర్ కణాలతో పాటు చుట్టూ ఉన్న మంచి కణాలు కూడా ఆ వేడికి కొంత కమిలినా ప్రాణాలను మింగేసే క్యాన్సర్ కణితి మాత్రం కరిగిపోతుంది. ఇప్పుడు మోడీ చేస్తున్న చికిత్స అదే.
ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ఇది కాదనలేని సత్యం. కళ్లెదురుగా కనిపిస్తున్న చిత్రం. అయితే - కష్టే ఫలి అన్నతరతరాల మానవ జీవిత అనుభవ సూత్రం నూటికి నూరు శాతం వర్తించే సమయం ఇదే.
మోడీ నిర్ణయంపై ఎన్నో విమర్శలు... మరెన్నో అపశకునాలు. నోట్లను రద్దు చేసిన దేశమేదీ బాగుపడలేదనే వారు కొందరు. నోట్లను రద్దు చేసిన నేతలెవరూ మళ్లీ విజయం సాధించలేదనేవారు ఇంకొందరు. కావొచ్చు... చరిత్ర నిజంగా పాఠం వంటిదే. ఇంతకుముందు నోట్లను రద్దు చేసిన నేతలు - దేశాలు ఎదుర్కొన్న అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని విజయం సాధించడానికి మోడీకి అన్ని అవకాశాలూ ఉన్నాయి. అంతేకాదు... నోట్ల రద్దు ప్రయత్నాలు బెడిసి కొట్టిన దేశాల్లో దాన్ని ఎలా అమలు చేశారు... అమలు చేసిన నేతల ఆలోచనా బలమెంత అనేదీ ఇక్కడ కీలకమే. అక్కడి ఆర్థిక వ్యవస్థ మూలాలేమిటి... ఆంతరంగిక పరిస్థితులేమిటన్నవీ ఆలోచించదగినవే. ప్రస్తుతం భారత్ పరిస్థితి వేరు. రాజకీయంగా సుస్థిరంగా ఉంది. ఆర్థికంగా స్థిరమైన వృద్ధి రేటుతో దూసుకెళ్తోంది. ఉత్పాదకత పెరుగుతోంది. ఎగుమతులు - దిగుమతుల బ్యాలన్సు సాధిస్తోంది... అన్నీ మంచి శకునాలే ఉన్నప్పుడు నల్లధనం నిరోధానికి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకేముంటుంది. అందుకే మోడీ టైం చూసి తగిన నిర్ణయం తీసుకున్నారు.
- అంతేకాదు.... మోడీ నిర్ణయం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. పలు దేశాలే కాదు.. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలూ ప్రస్తుతిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మోనిటరింగ్ ఫండ్ - యూరోపియన్ యూనియన్ - ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థలు మోడీ నిర్ణయాన్ని సమర్ధించాయి. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడయితే ''నేను మోడీ అభిమానిగా మారిపోయాను'' అని ప్రకటించారు.
- వివిధ అంతర్జాతీయ పత్రికలు మోదీ నిర్ణయాన్ని స్వాగతించాయి. 'ఫోర్బ్స్' పత్రిక 'భారత్ లో నోట్ల మార్పిడి మంచి ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే 30 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ చేసే డబ్బు భారతీయ బ్యాంకుల్లోకి వచ్చి చేరింది. కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతున్నా మొత్తం మీద ఇది ఒక తెలివైన పథకం' అని రాసింది. న్యూయార్క్ టైమ్స్ అయితే ఇది సాహసోపేతమైన, భారత్ ను ఉన్నత దిశగా తీసుకువెళ్ళేందుకు ఉపయోగపడే ప్రయోగమిది అని రాసింది. వాషింగ్టన్ పోస్ట్ వంటి పత్రికలూ దీనిపై పాజిటివ్ గా కథనాలు రాస్తున్నాయి.
- సింగపూర్ నుంచి వెలువడే 'ద ఇండిపెండెంట్' పత్రిక మోడీని ఆ దేశ గతిని మార్చిన గొప్ప నాయకుడు లీ క్వాన్తో సమానంగా పోలుస్తూ అనూహ్య రీతిలో పొగిడింది.
- ప్రఖ్యాత అమెరికన్ ఆర్థిక రంగ పత్రిక బ్లూమ్ బర్గ్ లో స్పెస్ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఒక వ్యాసం రాస్తూ ఆస్ట్రేలియా కూడా భారత్ పద్ధతిని అనుసరించి ఆ దేశపు పెద్ద నోట్లను రద్దుచేయాలని సూచించింది.
- అంతర్జాతీయ మీడియాలో మన దగ్గర ఉన్నట్లు అన్నిటికే ఒకే రిపోర్టరు - ఒకే సంపాదకుడు ఉండడు. ఆరోగ్యం - టెక్నాలజీ - ఆర్థికం... ఇలా ప్రతి అంశానికీ స్పెషలిస్టు జర్నలిస్టులు ఉంటారు. వారు ఆ రంగంపై విపరీతమైన కమాండ్ తో ఉంటారు. అలాంటి గొప్ప పత్రికల్లో నేరుగా నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ కథనాలు రాశారంటే అది ఏ విశ్లేషణ - ఆలోచన లేకుండా అల్లేసిన మనలాంటి జిగిబిగి కథనాలు కావు.
- దొంగనోట్లకు అడ్డుకట్ట.. మన నిఘా సంస్థల అంచనా ప్రకారం దేశంలో దొంగనోట్ల చెలామణి ద్వారా పాకిస్తాన్ ఏడాదికి 500 కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తోంది. మన ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయడానికే పాకిస్తాన్ పెద్ద ఎత్తున మన కరెన్సీని ముద్రించడం మొదలుపెట్టింది. ఇందుకోసం దుబాయ్‌లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ను పాకిస్తాన్ నిర్వహిస్తోందని నిఘా సంస్థలు ప్రకటించాయి. ఈ దొంగనోట్లన్నీ నేపాల్ - బంగ్లాదేశ్ - ఆప్ఘనిస్తాన్ ద్వారా భారత్ లోకి చేరుతున్నాయి. ఇటీవలి కాలంలో శ్రీలంక - మలేషియా - థాయిల్యాండ్ - చైనా - సింగపూర్ - ఓమన్ - హాలెండ్ ద్వారా దొంగడబ్బును భారత్‌లోకి చేర్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. స్విట్జర్లాండ్ తో పాటు జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ నుంచి పాక్ దొంగతనంగా పెద్దమొత్తంలో ఇంక్ కొంటోంది. తన కరెన్సీ నోట్లను ముద్రించేందుకు అవసరమైన కాగితం కంటే కూడా అధికమొత్తంలో కాగితం కొంటోంది. తన దేశపు కరెన్సీ కంటే అధిక సంఖ్యలో భారత కరెన్సీని పాక్ ముద్రిస్తోంది. పాక్ తన దేశంలోని హబీబ్ బ్యాంక్ ద్వారా దొంగనోట్లను నేపాల్ ద్వారా మన దేశంలోకి చొప్పిస్తోంది. ఇదంతా ఇప్పటికే వెల్లడైన నిజం. శత్రుదేశం వ్యవస్థీకృతంగా చేస్తున్న దాడిని అడ్డుకోవడానికి మోడీ వేసిన ఈ అడుగు ఉపయోగపడుతుంది.
- అంతేకాదు వేల కోట్ల రూపాయలు రాత్రికి రాత్రికి మార్చివేయగలిగిన హవాలా వ్యాపారులు మోడీ దెబ్బతో దివాలా తీశారు. హవాలా అన్నది సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థ. రాజకీయ నాయకులు - టెర్రరిస్టులు - అవినీతిపరులు - లంచగొండులు - పన్ను ఎగవేతదారులు - అండర్ గ్రౌండ్ డాన్ లు - మాదకద్రవ్యాల వ్యాపారులు హవాలా వ్యవస్థను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కేరళలోనే ఏటా 23వేల కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు జరుగుతున్నాయని ఒక అంచనా. దేశంలో రోజుకు 2 వేల నుంచి 3 వేల కోట్ల రూపాయల హవాలా వ్యాపారం జరుగుతోందని అంచనా. ఇప్పుడు దానికి అడ్డకట్ట పడుతుంది.
- నల్లధనంలో అధిక శాతం తీవ్రవాదులకు ఆర్థిక సహాయంగా మారుతున్నదని, వారికి నిధులు చేరకుండా పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందని, ఈ చర్యను స్వాగతిస్తున్నామని ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ కేంద్రంగా భారత వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న దావూద్ ఇబ్రహీం - జమ్మూ కాశ్మీర్ లోని హిజ్బ్ ఉల్ ముజాహిదీన్ లాంటి సంస్థలు బలవంతపు వసూళ్ళ ద్వారా సేకరించిన వేల కోట్ల రూపాయలను పెద్దనోట్ల రూపంలో దాచిపెట్టి, వాటిని తీవ్రవాద కార్యక్రమాలకు వాడుతున్నారు. వారందరికీ ఇది షాక్. వారి ఆర్థిక మూలాలు బ్లాక్.
- నాలుగైదు నెలలుగా రగులుతున్న కశ్మీర్లో అల్లర్లు ఒక్కసారిగా ఆగిపోయాంటే దానికి కారణం నోట్ల రద్దే. అవును... అవన్నీ డబ్బులిచ్చి చేయిస్తున్న అల్లర్లు. 500 నోటు చేతిలో పెడితే నాలుగు రాళ్లు విసిరి వెళ్లే అల్లరి మూకలున్నాయక్కడ. కానీ... ఇప్పుడు 500 నోటు చెల్లదు. ఇంక రాళ్లెందుకు విసురుతారు?
ఇలా ఇప్పటికే ఎన్నో ఫలితాలు చూపిస్తున్న నోట్ల రద్దుతో సమస్యలు లేవని కాదు. సామాన్యులు పడుతున్న ఇబ్బందులు చిన్నవీ కావు. కానీ.. ఒక బృహత్కార్యం కోసం కొంత కష్టం తప్పదు. కఠిన శిలను దేవతామూర్తిగా మలచాలంటే ఉలి దెబ్బ పడాల్సిందే.
- గరుడ