అక్క‌డ మిలిటెంట్ అనుకొని మంత్రినే కాల్చేశారు

Update: 2017-05-05 04:41 GMT
ఉగ్ర‌వాద స‌మ‌స్య‌లు ప్ర‌తి దేశంలోనూ ఉన్న‌దే. గ‌తంలో ఇలాంటి స‌మ‌స్య కొన్ని దేశాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అన్న‌ట్లుగా ఉండేది. ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్ర‌తి దేశంలోనూ ఉగ్ర‌వాద చికాకులు త‌ప్ప‌టం లేదు. ఉగ్ర‌వాదుల్ని నియంత్రించేందుకు దేశాల‌న్నీ కిందామీదా ప‌డుతున్నాయి. ఇందుకోసం దేశాలు పెడుతున్న ఖ‌ర్చు భారీగా ఉంటోంది.

ఉగ్ర‌వాదుల్ని నియంత్రించే విష‌యంలో ఆయా దేశాలు తీసుకునే చ‌ర్య‌లు ఒక ఎత్తు అయితే.. అందులో భాగంగా జ‌రిగే త‌ప్పులు కొన్ని దారుణ‌మైన ఫ‌లితాల‌కు దారి తీస్తాయి. తాజాగా అలాంటి ఉదంత‌మే సోమాలియాలో చోటు చేసుకుంది. ఉగ్ర‌వాద స‌మ‌స్య‌ను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఆదేశంలో భ‌ద్ర‌తాద‌ళాలు చేసిన పొరపాటుపై ఇప్పుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆ దేశ మంత్రిని భ‌ద్ర‌తాద‌ళాలు పొర‌పాటున మిలిటెంట్‌గా భావించి ఆయ‌న‌పై కాల్పులు జ‌రిపారు. ఈ దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌లో ఆయ‌న ప్రాణాలు కోల్పోయారు. దేశంలో అతి చిన్న వ‌య‌స్కుడైన మంత్రి అబ్బాస్ అబ్దుల్లాహి షేక్ (31) రెండు నెల‌ల క్రిత‌మే మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తాజాగా ఆయ‌న త‌న కారులో దేశాధ్య‌క్షుడి కార్యాల‌యానికి స‌మీపంలోకి కారులో వ‌స్తుండ‌గా.. ఆయ‌న్ను పొర‌పాటున మిలిటెంట్ గా భావించాయి భ‌ద్ర‌తాద‌ళాలు. అంతే.. ఆయ‌న‌పై కాల్పులు జ‌ర‌ప‌టంతో.. అక్క‌డిక‌క్క‌డే మంత్రి మ‌ర‌ణించారు. ఈ ఉదంతం ఆ దేశంలో సంచ‌ల‌నంగా మారింది. ఎంత పొర‌పాటైనా.. మంత్రిని మిలిటెంట్ అనుకోవ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు త‌లెత్తుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News