ఏపీ ఎంపీలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. దీనిపై ఏపీ ఎంపీలు రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేయటం.. దానికి మరింత ఘాటుగా ట్విట్టర్లో ట్వీట్స్ చేసి.. సై అంటే సై అన్నట్లుగా పవన్ వ్యవహరించటం తెలిసిందే.
పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు విభేదిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. తొందరపడి పవన్‌ని మాటలు అనే బదులు కాస్త ఒపిక పడితే బాగుంటుందన్న సూచన చేస్తున్నారు. ఇలా ఆచితూచి అడుగులు వేసే నేతల్లో ఒకరు సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి. ఈ మధ్యనే ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన ఆయన.. తాజాగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు కాస్తంత ఆసక్తికరంగా మారాయి.
పవన్ చేసిన వ్యాఖ్యలు వెనుక ఎవరో ఉన్నారన్న సందేహాన్ని వ్యక్తం చేసిన సోమిరెడ్డి.. పవన్‌ను ఎవరో రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్ మంచివారని..ఆయన రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. పవన్‌ను ఎవరైనా రెచ్చగొట్టటానికి ప్రయత్నించినా.. ఆయన అర్థం చేసుకోవాలన్నారు. మొత్తానికి పవన్నుఎవరో రెచ్చగొడుతున్నారంటూ సోమిరెడ్డి మాటకు పవన్ రెచ్చిపోతే.. మాట్లాడిన మరీ దొబ్బులు తిన్నట్లు అవుతుందని చెబుతున్నారు.
ఎవరో ఏదో చెబితే.. దానికే పవన్ రెచ్చిపోతారా? పవన్ అంత అనాలోచితంగా వ్యవహరిస్తారా? ఆయన ఆ మాత్రం ఆలోచించరా? అన్న ప్రశ్నలు ఆయన అభిమానులు వేస్తున్నారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన సోమిరెడ్డి.. తాజా వ్యాఖ్యలు అనవసరంగా చేశారా? అన్న సందేహం కలిగేలా ఉండటం గమనార్హం.