ఆనందయ్య మందు ఏపీలో సక్సెస్ కావడం.. కేంద్రం కూడా దీనికి ఆమోదం తెలుపడంతో ఇప్పుడు అందరి ఫోకస్ దానిపైనే ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని కూడా రాజకీయం చేసి వాడుకుంటున్న పరిస్థితులున్నాయి.
తాజాగా టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణపట్నం ఆనందయ్య మందుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు చరిత్రాత్మకమైందన్నారు. ఆనందయ్య మందు పేరుతో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు. మే21 నుంచి ఆనందయ్య మందును క్యాష్ చేసుకోవాలని కుట్రలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
శ్రేషిత టెక్నాలజీ వద్ద వెబ్ సైట్ కొని ఇంటర్నెట్ లో హోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసినట్లు సొమిరెడ్డి ఆరోపించారు.వెబ్సైట్ లో ధర రూ.15 పెట్టి ప్రజలకు అందుబాటులోకి వచ్చేసరికి రూ.167 చేశారని మండిపడ్డారు. శ్రేషిత కంపెనీలో డైరెక్టర్లు వైసీపీ నాయకులని చెప్పుకొచ్చారు. కోటిమందికి ఆన్ లైన్ లో మందు రూ.120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాణి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సొమిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇక ఆనందయ్య ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వం సహాయం అందిస్తామని.. ఉచితంగానే ఇస్తామని మరోవైపు తెలిపింది. అయితే సోమిరెడ్డి మాత్రం దీనికి రేటు ఫిక్స్ చేసి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించడం చర్చనీయాంశమైంది.