మా ఆయన అందమైన ఆడోళ్లనే చూస్తారు !!

Update: 2015-08-04 10:16 GMT
  ఢిల్లీ మాజీ న్యాయమంత్రి సోమనాథ భారతికి ఊహించని దెబ్బ తగిలింది... అందమైన మహిళలకు
​ కూడా​ ఆప్ సర్కార్ భద్రత కల్పిస్తుందని చెప్పిన ఆ ఆప్ నేత వివాదాస్పద వ్యాఖ్యలకు సొంతింటి నుంచే కౌంటర్ పడింది. స్వయంగా ఆయన భార్యే ఆయనపై సెటైర్ వేసింది. 'అందమైన మహిళలకు భద్రత కల్పిస్తామంటున్నారు.. మరి మాలా యావరేజిగా ఉండేవారి సంగతేంటి' అని ఆయన మాజీ భార్య లిపిక మిత్ర ఆమె ప్రశ్నించారు. అంతేకాదు.... ఆయనకు మహిళలంటే గౌరవం లేదని.. తనను కూడా వేధించేవారని... ఆయన వ్యాఖ్యలే ఆయన వైఖరికి నిదర్శనమని లిపిక పేర్కొన్నారు.

            ఆయన్ను ఎంతగానో ప్రేమించాను... కానీ, ఆయన అందమైన ఆడవాళ్ల వెంటపడేవారు... ఆయన వ్యాఖ్యలు కూడా ఆయనేంటో చెబుతున్నాయి.. అందంగా లేననే కారణంతోనే నాపై విరుచుకుపడేవారు. నేనేమీ పెద్ద అందగత్తెను కాను... ఇప్పుడు మాలాంటివాళ్ల పరిస్థితి ఏంటి.. మేం రక్షణ కోసం ఎక్కడికి పోవాలి అంటూ ఆమె ఘాటుగానే వేసుకున్నారు.

            కాగా... అందమైన మహిళలకు ఆప్ సర్కార్ భద్రత కల్పిస్తుందని  సోమనాథ్ భారతి అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ శాంతి భద్రతలు ప్రభుత్వం అధీనంలో ఉంటే ఢిల్లీలో అందమైన మహిళలు అర్ధరాత్రి కూడా ధైర్యంగా తిరిగే పరిస్థితి కల్పిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.  అసెంబ్లీ సాక్షిగా చేసిన సోమనాథ్ భారతి చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు సోమనాథ్ వ్యాఖ్యలను ఖండించాయి. చివరకు ఆయన భార్య కూడా ఆయనకు గడ్డిపెట్టింది.
Tags:    

Similar News