జూనియర్ ఎన్టీయార్ ఎవరు వారు అంటే ఆయన సినీ అభిమానులందరివారు. నందమూరి వారి ఇంట నటన పండించుకున్న మూడవ తరం వారసుడు ఆయన. ఇక ఘనమైన సినీ రాజకీయ నేపధ్యం ఉన్న వారు కూడా ఆయన. అలాంటి జూనియర్ ఎన్టీయార్ సేవలను ఒకసారి చంద్రబాబు నాయకత్వాన టీడీపీ వాడుకుంది. అధికారంలోకి 2009లో రాలేకపోవచ్చు కానీ జూనియర్ మాత్రం ఉమ్మడి ఏపీ అంతా ఊపేశారు అనే చెప్పాలి.
ఆ తరువాత మాత్రం జూనియర్ రాజకీయాల జోలికి రాలేదు. ఆయన తానుగా ఆగిపోయారా లేక ఎవరైనా నియంత్రించారా అన్నది పక్కన పెడితే జూనియర్ లో మంచి నటుడే కాదు, మంచి రాజకీయ నాయకుడే ఉన్నారు అని చెప్పాలి. ఆయనలో బలమైన రాజకీయ ఆకాంక్ష కూడా ఉంది. అందుకే ఆయన గురించి టీడీపీ తమ్ముళ్ళు ఆరాటపడుతూంటారు.
కానీ జూనియర్ మాత్రం టీడీపీ వైపు గత పుష్కర కాలంగా తొంగి చూసినది లేదు, ఆ వాకిట వంగి వాలినదీలేదు. ఇక ఆయన ఏ రాజకీయ నాయకుడితో కూడా కలసి ఫొటో దిగింది అంతకంటే లేదు. ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీ అయినపుడు కూడా ఆయన రాలేదు, అలాగే కేసీయార్ తో సినీ వర్గాలు కలసినా జూనియర్ అక్కడ కనిపించలేదు. ఆయన తన సినిమాలూ తానేంటో అన్నట్లుగానే ఉన్నారు.
అటువంటి జూనియర్ సడెన్ గా దేశాన్నేలే అతి పెద్ద పార్టీ బీజేపీ కి చెందిన సర్వ శక్తిమంతుడు అయిన అమిత్ షా తో భేటీ కావడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరచింది. నిజానికి జూనియర్ ని రమ్మని పిలిస్తే రాను అని చెప్పలేరు. కేవలం మర్యాదపూర్వకమైన భేటీ షాతో జరిగినా దానికి రాజకీయంగా చిలవలు పలవలూ అల్లే వారు ఉంటారని జూనియర్ కి తెలియనిది కాదు.
అయినా సరే ఆయన అమిత్ షాని కలవడానికి వెళ్లారు అంటే ఇలాంటి వాటిని పట్టించుకోవద్దు అనుకున్నారో లేక ఇలా జరిగినా పర్వరాలేదు అనుకున్నారో ఆయనే చెప్పాలి. మొత్తానికి అమిత్ షా తో జూనియర్ భేటీ అయిన ఒకటి రెండు రోజుల పాటు మాత్రం బీజేపీ నేతలు కాస్తా జాగ్రత్తగానే ఆచీ తూచీ మాట్లాడరు, అది జస్ట్ కర్టెసీ కాల్ అంతకు మించి ఏమీ లేదు అన్నారు.
కానీ ఇన్ని రోజులు గడచిపోయాక ఇపుడు మాత్రం కొత్త కొత్త విషయాలు బయటపెడుతున్నారు. తెలంగాణాలో నేతలు అయితే జూనియర్ ఎంటీయార్ మీద ఆశలు పెట్టుకున్నట్లుగా సీన్ కనిపిస్తోంది. ఇక ఏపీలో బీజేపీ నేతలు అయితే అమిత్ షా తో జూనియర్ భేటీకి రాజకీయ ప్రాముఖ్యత ఉండకుండా ఎలా ఉంటుంది అని లా పాయింట్లు తీస్తూ వచ్చారు.
ఇపుడు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే మరో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల కోసం జూనియర్ ఎన్టీయర్ సేవలను ఉపయోగించుకుంటామని బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేసి ఏపీ రాజకీయాలను బాగానే కెలికేశారు. జూనియర్ ఎన్టీయార్ కి ప్రజాదరణ ఎక్కువ అని, అందువల్ల ఆయన సేవలను వాడుకుంటామని అసలు విషయం చెప్పారనుకోవాలి.
దీని అర్ధమేంటి మహానుభావా అంటే కచ్చితంగా జూనియర్ చేత ప్రచారం చేయించుకుంటామని చెప్పడమే అంటున్నారు. అంటే జూనియర్ ని ఎన్నికల ప్రచారంలో దింపి బీజేపీకి ఓటేయండి అని ప్రచారం చేయించుకుంటే టీడెపీఎ సంగతేంటి అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆయన నందర్మూరి వారి వంశీకుడు. మరి అన్న గారు పెట్టిన టీడీపీ ఆ వైపు ఉండగా బీజేపీకి జూనియర్ ప్రచారం చేస్తే అది ఎలా ఉంటుంది. జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు
ఏపీలో రాజకీయ అధికారం కోసం అల్లల్లాడుతున్న ఒక బలమైన సామాజికవర్గం ఎలా రియాక్ట్ అవుతుంది ఇవన్నీ ప్రశ్నలే. నిజానికి జూనియర్ వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తారా. బీజేపీ కోసం ఆయన రాజకీయ రంగు ముఖానికి పూసుకుంటారా ఇవన్నీ కూడా ఇప్పటికైతే ఊహాజనితమైన విషయాలే. కానీ సోము వీర్రాజు ఇలా బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చి జూనియర్ మావాడే అంటే మాత్రం అది టీడీపీకి ఎక్కడో బాగానే కెలికినట్లుగా ఉంటుంది అని అంటున్నారు.
ఇప్పటికే జూనియర్ ని పార్టీలోకి తీసుకురమ్మని ఏకంగా బాబు సభలలోనే తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇపుడు జూనియర్ ని బీజేపీ కోసం వాడుకుంటామని కాషాయం పార్టీ వారు ఇలా ఓపెన్ గానే అంటే తమ్ముళ్ళు అసలు ఊరుకోరు అని అంటున్నారు. ఆ వత్తిడి అంతా టీడీపీ అధినాయకత్వం మీద పడుతుంది అని కూడా అంటున్నారు.
మరి ఆ విధంగా టీడీపీని కెలికి అక్కడ కలి పుట్టించడానికేనా చూసి మరీ సోము వీర్రాజు ఇలా బాణాలు వేస్తోంది అని కూడా చర్చ సాగుతోంది. చూడాలి మరి జూనియర్ మావాడే అని బీజేపీ చెబుతున్న దాని వెనక ఉన్న ధీమా ఏంటో. అసలు తెలుగు రాజకీయాల్లో జూనియర్ పాత్ర ఏంటో కూడా చూడాలి.