టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలు, అల్లుతున్న వ్యూహాలపై బీజేపీ ఇక ఎంతమాత్రం కూడా సైలెంట్‌గా ఉండేలా లేదన్న వాదన వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసినా... ఏపీకి ప్రత్యేక హోదాపై సాగుతున్న ఉద్యమం నేపథ్యంలో బీజేపీకి గుడ్ బై చెప్పిన టీడీపీ... ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య మాటల మంటలు రేగుతూనే ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు అంటే అంతెత్తున ఎగిరి పడుతున్న బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సొము వీర్రాజు... ఎప్పటికప్పుడు బాబు పాలనను ఏకిపారేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తోందని, ఇందుకు తన వద్ద పక్కా ఆధారాలున్నాయని చెబుతూ వస్తున్న వీర్రాజు.. తాజాగా మరోమారు పక్కా ఆధారంతోనే బాబుపై వ్యూహాత్మక దాడికి దిగారు. బాబు డబుల్ గేమ్ ఆడుతున్నారని చెప్పేందుకు తాను ఇప్పుడు బయటపెడుతున్న సాక్ష్యమే నిదర్శనమంటూ వీర్రాజు తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించేశారు.
గతంలో ఏపీకి కేంద్రం విడుదల చేసిన నిధులకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కీర్తిస్తూ చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా సుదీర్ఘ ప్రసంగమే చేశారట. అయితే అదే అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు చంద్రబాబు... రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం చేస్తోందని మొన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైనంపై కాస్తంత లేటుగానే అయినా పక్కా ఆధారాలను సేకరించుకుని మరీ వీర్రాజు రంగంలోకి దిగిపోయారు. నాడు మోదీని కీర్తిస్తూ... రాష్ట్రానికి కేంద్రం ఇతోదికంగా నిధులు విడుదల చేస్తోందని బాబు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను మీడియా ముందు పెట్టిన వీర్రాజు... బాబు ఆడుతున్నది డబుల్ గేమ్ కాక మరేమిటని ప్రశ్నించారు. నాడు రాష్ట్రానికి కేంద్రం నిధులిస్తోందని చెప్పిన నోటితోనే... ఇప్పుడు రాష్ట్రానికి నిధులేమీ విడుదల కావడం లేదని, రాష్ట్రానికి మోదీ అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారని కూడా వీర్రాజు విరుచుకుపడ్డారు. మిత్రపక్షంగా ఉన్న సమయంలో రాష్ట్రానికి న్యాయం చేసిన బీజేపీ... మైత్రి తెగిపోగానే రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీగా ఎలా మారిందో చంద్రబాబే చెప్పాలని కూడా వీర్రాజు డిమాండ్ చేశారు.
పనిలో పనిగా పాత ఆరోపణే అయినా కూడా చంద్రబాబుపై వీర్రాజు మరో సంచలన ఆరోపణ చేశారు. నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి నడిచిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతున్నాకని ధ్వజమెత్తారు. నాడు మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత... నాడు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. కన్నడనాట త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారని, ఇందులో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చంద్రబాబు తెర వెనుక చర్చలు నడుపుతున్నారని ఆరోపించారు. ఇదెక్కడి రాజకీయమో తనకు అర్థం కావడం లేదని కూడా వీర్రాజు సెటైర్లు సంధించారు.