బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యూహం మారిందా ? ఇప్పటి వరకు సీఎం జగన్‌పైనా, ఏపీ ప్రభుత్వ వైఖరిపైనా.. ఆయన సైలెంట్‌గా ఉన్నారు. విమర్శించీ విమర్శించనట్టుగా ఇప్పటి వరకు మాట్లాడారు. కొన్నాళ్ల కిందట జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలోనూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో ఆయన విఫలమయ్యారనే వాదన ఆ పార్టీ నేతల మధ్య హల్చల్ చేసింది. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా.. ఎప్పుడు నోరు విప్పినా.. సోము టార్గెట్ అంతా కూడా.. టీడీపీపైనా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా ఉంటుంది. కానీ, వైసీపీపై పెద్దగా విమర్శలు చేసింది లేదు.
దీనిపై పురందేశ్వరి సహా అనేక మంది నేతలు.. గుస్సాగా ఉన్న విషయం కొన్నాళ్లుగా చర్చనీయాంశగా మారింది. దీనిపై కొందరు ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేశారు. కొందరు నాయకులు నోరు విప్పితే.. వైసీపీని, సీఎం జగన్‌ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కానీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన.. సోము మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించడం.. టీడీపీని టార్గెట్ చేయడం వివాదాలకు, ఆయనపై అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఏకంగా ఆయన పదవికి కూడా గండం పొంచి ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి. త్వరలోనే సోమును మార్చడం ఖాయమని.. ఫైర్ బ్రాండ్లకు అవకాశం ఇస్తారని కూడా ప్రచారం సాగింది.
ఇదిలావుంటే.. తాజాగా సోము జగన్‌పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెడుతున్న తీరును ఎండగట్టారు. మీ ఆస్తులు తాకట్టు పెట్టుకోవచ్చుగా అంటూ.. విరుచుకుపడ్డారు. దీంతో ఒక్కసారిగా సోము వాయిస్ ఇలా మారిందేంటబ్బా! అనే చర్చ తెరమీదికి వచ్చింది. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకు టీడీపీపై నిప్పులు చెరిగిన సోము.. తాజాగా మాత్రం ఆ పార్టీ నేతలను వెనుకేసుకు రావడం.. వైసీపీ నేతలను, మంత్రులను తిట్టిపోయడం కూడా ఆశ్చర్యంగా మారింది.
`ఏదో జరిగే ఉంటుంది. లేకపోతే.. సోము ఇలా హఠాత్తుగా ఎందుకు మారతారు?` అనే చర్చ జోరుగా సాగుతోంది. పదవి గండం పొంచి ఉందనే సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఇలా చేస్తున్నారని కొందరు అప్పుడే గుసగుసలాడడం గమనార్హం. మరి సోము వైఖరి తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.