కొడుకు, అమ్మ అక్రమ సంబంధం !

Update: 2020-03-04 01:30 GMT
అక్రమసంబందాలు ..ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయాయి. ఉన్నదానితో సంతృప్తి చెందని వారు, లేనిదాని కోసం ప్రాకులాడుతూ అక్రమసంబందాలని కొనసాగిస్తూ, ఆ అక్రమ సంబంధాల ముసుగులో తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది జీవితాలు ఈ అక్రమసంబందాల వల్ల నడిరోడ్డుపైకి వచ్చాయి. అయినా కూడా రోజురోజుకి ఇలాంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప, తగ్గడంలేదు.

తాజాగా ఇలాంటి అక్రమసంభందమే మరొకటి బయటపడింది. కర్ణాటకలోని ఒక విద్యాసంస్ధల అధినేత హత్యకు గురయ్యారు. పేరు పొందిన విద్యా సంస్ధల అధినేత కాబట్టి వ్యాపారంలో ప్రత్యర్ధి వర్గం వారే హత్య చేయించి ఉంటారనుకున్న పోలీసులకు విచారణలో బయటపడ్డ నిజాలు పోలీసులని సైతం దిమ్మ తిరిగేలా చేసాయి. మొదటి భార్య కుమారుడు, రెండో భార్య మధ్య ఏర్పడిన అక్రమ సంబంధం ఆ వ్యాపారవేత్తను బలి తీసుకుంది. కేసు ఇన్వెస్ట్ గేట్ చేసిన పోలీసులు ప్రధాన నిందితులైన రెండోభార్యను, మొదటి భార్య కొడుకుతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

కర్ణాటక లోని విజయపురా జిల్లాలోని బసవన బాగేవాడిలో గల మడివాళేశ్వర గ్రూప్ విద్యాసంస్ధల అధినేత దామూ నాయక్ ను ఫిబ్రవరి 25న హంతుకులు గొంతుకోసి హత్య చేశారు. విద్యాసంస్థల అధినేత కావటంతో ఈ వార్త జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసు యంత్రాంగం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మొదట్లో పాతకక్షల వల్లే చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించారు. ఆయనతో శతృత్వం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ , పోలీసులకి ఎటువంటి క్లూ దొరకలేదు. దీనితో కుటుంబ సబ్యులని విచారించడం మొదలుపెట్టారు.

ఆయనకి కోట్లాది రూపాయల ఆస్తి ఉండటం, అలాగే అయన రెండు పెళ్లిళ్లు పెళ్లిళ్లు చేసుకున్నట్టు గుర్తించి అటువైపు నుండి కేసుని దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. దాము నాయక్ మొదటి భార్య కుమారుడు సుభాష్ నాయక్.. రెండో భార్య ప్రేమా దాము నాయక్ మధ్య ఏర్పడిన అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు దారి తీసిందని తేలింది. దాము నాయక్‌ ను అడ్డు తొలగించుకుంటే.. కోట్లాది రూపాయల ఆస్తి తమ వశం అవుతుందని నిందితులు భావించారని, ఆయనను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులకు సుపారీ ఇచ్చారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు. సుభాష్ నాయక్, ప్రేమ, లతో పాటు అశోక్ లమాణి, అవ్వణ్ణ గ్వాతగి, శివణ్ణ కొణ్ణూర్ లను అరెస్టు చేశారు. సెల్ ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tags:    

Similar News