హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆసక్తికరంగానే కాదు.. అవాక్కు అయ్యేలా చేస్తోంది. మొయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా ఫోకస్ కాని ఈ ఉదంతం పిల్లల మీద వీడియో గేమ్ లు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనటానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. హైదరాబాద్ శివారుకు చెందిన పోలీస్ స్టేషన్ కు పదహారేళ్ల కుర్రాడు తన తండ్రి తనను అమితంగా వేధిస్తున్నాడని.. అతని నుంచి తనకు రక్షణ కావాలంటూ హాక్ ఐ యాప్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
ఉదయం ఆరు గంటల వేళలో తండ్రి మీద కంప్లైంట్ చేసిన అతను.. ఉదయం పది గంటల వరకు వెయిట్ చేసి.. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో అతగాడు మరోసారి పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో.. రియాక్టు అయిన పోలీసులు.. తండ్రిమీద టీనేజర్ ఎందుకు ఇలాంటి ఫిర్యాదు చేస్తున్నాడన్న విషయాన్ని ఆరా తీసి.. విషయం ఏమిటో తెలుుకొని తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఫిర్యాదు ఇచ్చిన కుర్రాడి ఇల్లు పాతబస్తీలో ఉంది. అక్కడికి వెళ్లిన పోలీసులకు షాకింగ్ సీన్ కనిపించింది. అతని తండ్రి అనారోగ్యంతో బాధ పడుతూ.. చికిత్స పొందుతున్నాడు. అలాంటి తండ్రి కొడుకును ఎలాంటి ఇబ్బందికి గురి చేయొచ్చు?అని ఆశ్చర్యపోయిన పోలీసులు.. ఫిర్యాదు చేసిన కుర్రాడ్ని.. నీ తండ్రి నుంచి నీకెలాంటి హాని ఉందని అడిగితే.. అతగాడు ఇచ్చిన ఆన్సర్ కు పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.
తన తండ్రి తాను కోరిన ప్రతిసారీ ఫోన్ ఇవ్వటం లేదని.. అందుకే తండ్రి మీద ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. దీంతో సదరు కుర్రాడి తండ్రితో మాట్లాడిన పోలీసులు.. ఆయన వెర్షన్ విని మరింత అవాక్కు అయ్యారు. తమ ఇంట్లోఒకే ఒక స్మార్ట్ ఫోన్ ఉందని.. తరచూ తన కొడుకు ఆ ఫోన్ తీసుకొని ఫ్రీ ఫైర్.. పబ్జీ లాంటి ఆటల్నిడౌన్ లోడ్ చేసుకొని ఆడుతున్నాడని.. పగలు..రాత్రి తేడా లేకుండా ఆడటంతో తాను మందలించినట్లు చెప్పాడు. ఒకవేళ.. తాను గట్టిగా మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్లు చెప్పాడు.
అసలు పదహారేళ్ల టీనేజర్ కు తండ్రి మీద కంప్లైంట్ చేయాలన్న ఆలోచన రావటం ఏమిటి? హాక్ ఐ గురించి అవగాహన ఎలా వచ్చిందన్న విషయంలోకి వెళితే..స్కూల్లో నేరాలు.. వాటికి సంబంధించిన ఫిర్యాదుల్ని హాక్ఐ ద్వారా పోలీసులకు ఎలా ఇవ్వాలన్న దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించటం.. దాంతో తనకు సెల్ ఫోన్ ఇవ్వని తండ్రి మీద కంప్లైంట్ చేశాడీ టీనేజర్. ఫోన్.. అందులో ఆడే ఆటలు చిన్న వయస్కుల వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయనటానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పక తప్పదు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.