గ‌ర్ల్ ప్రెండ్ స్నేహితుడిపై కాంగ్రెస్ నేత కొడుకు దాడి!

Update: 2018-06-06 09:17 GMT
అదృష్ట దేవ‌త వెంట ఉండ‌టంతో చేజారిన అధికారంలో ఏదోలా చేజిక్కించుకోగ‌లిగింది క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఎత్తుల్ని చిత్తు చేస్తూ.. కొత్త స్నేహితుడు జేడీఎస్ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన వైనం తెలిసిందే. అధికారం చేతిలో ఉంద‌న్న మ‌ద‌మో.. మ‌రింకేదైనా కార‌ణ‌మో కానీ.. క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత కొడుకు నిర్వాకం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ కార్పొరేట‌ర్ లింగ‌రాజు కుమారుడు రాకేశ్ ఒక అమ్మాయిని కొంత‌కాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే.. ఆ యువ‌తి వేరే స్నేహితుడితో చ‌నువుగా ఉంటుంద‌ని తెలుసుకున్నాడు. దీంతో.. కోపంతో.. ఆసూయ‌తో ఉడికిపోయాడు. త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ త‌న‌తో త‌ప్పించి మ‌రెవ‌రితోనూ క్లోజ్ గా ఉండ‌కూడ‌ద‌ని అనుకున్నాడు.

ప‌థ‌కం ప్ర‌కారం త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ స్నేహితుడిపై క‌త్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన బాధితుడు ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఉదంతంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. చేతిలో అధికారం ఉన్న వేళ‌.. ఇలాంటి ఉదంతాల‌తో ప్ర‌భుత్వ ప‌రప‌తిని దెబ్బ తీస్తుంద‌న్న విమ‌ర్శ‌లు వస్తున్నాయి.


Tags:    

Similar News