ల‌ఖింపుర్ కేసు : విచార‌ణ‌కు హాజ‌రైన కేంద్ర మంత్రి కొడుకు

Update: 2021-10-09 04:59 GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని ల‌ఖింపుర్‌ లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ కేసులో ఇవాళ క్రైం బ్రాంచీ పోలీసులు ముందు ఆశిష్ మిశ్రా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. నిర‌స‌నకారుల‌ను కారుతో ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మ‌ర‌ణించారు. ఆ కేసులో ఆశిష్ మిశ్రాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గ‌త కొన్ని రోజుల నుంచి ఆచూకీలేని ఆశిష్ మిశ్రా ఇవాళ ల‌ఖింపూర్‌లో క్రైం బ్రాంచీ ఆఫీసుకు వెళ్లారు.

ఆశిష్‌పై మ‌ర్డ‌ర్ కేసు ఉన్నా.. అత‌న్ని ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్టు చేయ‌లేదు. అన్న‌దాత‌ల మీద‌కు దూసుకెళ్లిన ఎస్‌యూవీ త‌మ‌దే అని చెప్పిన కేంద్ర మంత్రి .. ఆ కారులో త‌న‌ కుమారుడు లేర‌ని స్ప‌ష్టం చేశారు. అయితే శుక్ర‌వారం ఆశిష్ మిశ్రా కోసం డీఐజీ మూడు గంట‌ల పాటు ఎదురుచూశారు. ఇవాళ మ‌ళ్లీ ల‌ఖింపుర్ పోలీసు స్టేష‌న్‌కు డీఐజీ వ‌చ్చారు.

మ‌రోవైపు ల‌ఖింపుర్‌లో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ నిరాహార దీక్ష కొన‌సాగిస్తున్నారు. ల‌ఖింపుర్ హింస‌లో ప్రాణాలు కోల్పోయిన జ‌ర్న‌లిస్టు ర‌మ‌ణ్ క‌శ్య‌ప్ నివాసం వ‌ద్ద సిద్దూ ధ‌ర్నా చేప‌ట్టారు. కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడిని అరెస్టు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News