బీహార్ ఎన్నికల ఫలితాలు తమకు మేలు చేశాయా? లేక నష్టం చేస్తున్నాయా? అన్న సందిగ్ధావస్థలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొట్టుమిట్టాడు తోంది. నిజానికి బీహార్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోశాయి. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత పార్టీ అగ్ర నేతల నుంచి గల్లీ కార్యకర్తల దాకా ప్రతి ఒక్కరి ముఖాల్లో చాలా కాలం తర్వాత వెలుగు రేఖలు తొంగి చూశాయి. కేవలం 4 నుంచి 27 స్థానాలకు ఎగబాకడం బీహార్‌లో రెండు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్‌కు ఇది రెండవసారి. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలోనూ విజయోత్సాహం తొణికసలాడటమే కాకుండా పార్టీ భవిష్యత్‌పై కొత్త ఆశలు రేకెత్తాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నితీశ్ కుమార్‌కు ఫోన్ చేసి అభినందించగా దానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.
ఇదంతా ఆ ఫలితాల వేడి ప్రభావం. కాస్తంత ఊపిరి తీసుకుని తర్వాత చూసుకుంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సరికొత్త ముఖచిత్రం కళ్లముందు సాక్షాత్కరిస్తున్నది. యావత్ భారతదేశానికి ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన బీహార్ ఎన్నికల ఫలితాలపై సోనియా గాంధీ ఎక్కడా కూడా, ఏ సందర్భంలోనూ పెదవి విప్పకపోవడం ఇందులో భాగమేనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు తనయుడు రాహుల్ గాంధీతో పాటుగా మీడియా ముందుకు వచ్చారు సోనియా. ఈసారి అలా చేయలేదు సరికదా.. ఫలితాలపై పార్టీ అధినేత్రి ఇలా అన్నారు అంటూ ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడం గమనార్హం. సోనియా వ్యూహాత్మక మౌనం దేనికి సంకేతమన్న సందేహాలు వినిపిస్తున్నాయి.
మహాకూటమి విజయ ప్రస్థానం.. యూపీఏ చాపకిందకు నీరు తెస్తుందా? అది రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుకు ప్రతిబంధకమవుతుందా? మహాకూటమితో జట్టుకట్టడం బీహార్‌లోనైతే మంచి ఫలితాలను ఇచ్చింది. కానీ అదే రీతిగా జాతీయ స్థాయిలో మహాకూటమితో చేతులు కలిపితే...అసలే అంతంతమాత్రపు ప్రజాకర్షణతో నెట్టుకొస్తున్న రాహుల్ గాంధీ స్థానం ఎక్కడ ఉంటుంది? నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్.. ఇలా సరిగ్గా ఆ సమయానికి వెలుగులోకి వచ్చే అతిరథ మహారథుల్లాంటి రాజకీయ దిగ్గజాల వెలుగు ముందు కొడిగట్టిన దీపంలా మసకబారిపోతారా?బీహార్ ఫలితాల తర్వాత సుపరిపాలనకు పెద్ద దిక్కులా మారిన నితీశ్ కుమార్ జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతారని, మోడీకి అసలు సిసలు ప్రత్యామ్నాయంగా నిలుస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
నితీశ్ సారథ్యంలోనే మూడో ఫ్రంట్ రూపుదాలిస్తే... ప్రధానమంత్రి అభ్యర్థి సహజంగానే నితీష్ అవుతారు. ఇక రాహుల్ ఆ ఆశ వదులుకోవాల్సి వస్తుందన్నదే సోనియాగాంధీ దిగులుగా తెలుస్తోంది. కాబోయే ప్రధాని మాట కాలమెరుగు.. కనీసం జాతీయ స్థాయి నేతగానైనా రాహుల్ నిలదొక్కుకునే అవకాశమైనా తనయుడికి లభిస్తుందా? అనే సందేహం సోనియా గాంధీలో సుడులు తిరుగుతూ ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.