మోడీ ఇష్యూలో అది వర్తించదా సోనియమ్మ?

Update: 2015-12-21 09:09 GMT
తమ దాకా వస్తే కానీ అన్నది ఊరికే అనలేదేమో. తన మీద విమర్శలతో విరుచుకుపడుతున్న కమలనాథులపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కోపం వచ్చేసింది. ప్రతి విషయానికి సోనియాగాంధీనే బాధ్యత వహించాలా? అంటూ ఆమె నిప్పులు కక్కుతున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థులపై కాంగ్రెస్ నేతలు విసిరే వ్యూహాన్నే.. ఆమెపై ప్రయోగిస్తే.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న సోనియా.. దేశంలో జరిగే ప్రతి విషయానికి ప్రధాని మోడీదే బాధ్యతన్న విమర్శల మాటేమిటి?

ఎక్కడో మారుమూల ఒక గ్రామంలో ఏదైనా హత్య జరిగితే.. ఢిల్లీలోని ప్రధాని మోడీనే బాధ్యత వహించాలని.. కొన్ని వర్గాల మధ్య జరిగే తగులాటకు మోడీనే కారణమంటూ.. ఒకటి కాదు.. రెండు కాదు గడిచిన కొద్దికాలంగా అసహనం పేరిట దేశం మొత్తం ఆగమాగం చేసిన కాంగ్రెస్ పరివారం.. తన మీద విమర్శల వేలు పడినంతనే.. గుస్సా అయిపోవటం దేనికి నిదర్శనం.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీద ఢిల్లీ క్రికెట్ సంఘంలో కుంభకోణం జరిగిందంటూ ఈ మధ్యన వివాదం రాజుకోవటం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన జైట్లీ తాజాగా ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. యూపీఏ హయాంలో సోనియాగాంధీని కీర్తి అజాద్ కలిసిన తర్వాతే డీడీసీఏ కుంభకోణం తెర మీదకు వచ్చిందని.. ఈ అంశం వెనుక సోనియాగాంధీ ఉన్నట్లుగా జైట్లీ ఆరోపించారు. దీంతో.. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడిన సోనియా.. ప్రతి దానికి సోనియాగాంధీనే బాధ్యత వహించాలా? అంటూ అగ్రహంగా ప్రశ్నించారు. మరి.. తమ రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఇలాంటి లాజిక్ లు గుర్తుకు రావా..?
Tags:    

Similar News