తనకో న్యాయం.. పరులకో న్యాయం అన్నట్లుగా వ్యవహరించటమే కాదు.. జట్టు.. జుట్టు ముడేసి కొట్టుకు చావమని చెప్పి..చోద్యం చూస్తున్నట్లు ఉండిపోయే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లా పాయింట్లు తీస్తున్నారు. తాను చేసిన వెధవ పనుల గురించి ఒక్కసారి కూడా పెదవి విప్పని ఆమె.. ఇప్పుడు మాత్రం ఎన్నెన్నో సందేహాలు వ్యక్తం చేస్తూ.. నీతులు చెప్పేస్తున్నారు.
చేతిలో అధికారం ఉన్నప్పుడు కన్నుమిన్ను కానరాకుండా ఇష్టారాజ్యంగా పాలించేసి.. ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్న సోనియాగాంధీ గతంలో తాను చేసిన పనుల గురించి ఇసుమంత కూడా ఆలోచించరన్న విషయం తాజా ఉదంతం చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఆరు దశాబ్దాలుగా సాగుతున్న నాగాలాండ్ సమస్యకు పరిష్కారం వెతుకుతూ.. నాగాలాండ్ లో తిరుగుబాటు దారులతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోవటం తెలిసిందే. ఈ ఒప్పందాన్ని కుదర్చుకునే సమయంలో సంప్రదింపులకు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవకపోవటాన్ని ఆమె తప్ప పట్టారు. అయితే.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారు కావట గమనార్హం.
ముఖ్యమంత్రులంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావటంతో చర్చలకు పిలవలేదని విమర్శించిన సోనియా.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటల్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా అంత పెద్ద నిర్ణయం తీసుకోవటం షాక్ తగిలినట్లు అయ్యిందని వ్యాఖ్యానించారు.
నిజానికి సోనియమ్మ మాటల్లో నిజం ఎంతుందో ఒకసారి చూస్తే.. నాగా ఇష్యూను పరిష్కరించే సమయంలో ప్రధాని మోడీ.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొదలు కొని దేవగౌడ.. మమతా బెనర్జీ.. జయలిత.. ఇలా పలువురు ముఖ్యనేతల్ని.. బలమైన ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం మర్చిపోకూడదు.
ఇక.. నీతులు చెబుతున్న సోనియమ్మ సంగతికే వస్తే.. ఎక్కడి ఉదాహరణలో ఎందుకు.. ఏపీ వ్యవహారాన్నే తీసుకుందాం. రాష్ట్ర విభజన జరిగే సమయంలో.. విభజన ఎలా ఉండాలి? ఏలా చేయాలన్న అంశంపై ఒక్క సమావేశాన్ని అయినా నిర్వహించారా? అంతదాకా ఎందుకు.. విభజన చట్ట తయారీలో ఒక్క తెలుగు వ్యక్తికి అవకాశం ఇచ్చారా? అంటే లేదనే చెప్పాలి. తెలుగు వారు ఒక్కరు కూడా లేని సమూహం తెలుగు రాష్ట్ర విభజన చట్టాన్ని రూపొందించిన దాని పుణ్యమే.. విభజన తర్వాత కూడా నిత్యం తిట్టుకోవటం.. కొట్టుకోవటం.. పంచాయితీలు పెట్టుకోవటం అన్న విషయాన్ని మర్చిపోకూడదు.
కోట్లాది మందికి మనశ్శాంతి లేకుండా చేసిన సోనియాగాంధీ ఈ రోజులు నాగాలాండ్ మీద మాత్రం గుండెలు బాదుకుంటున్న తీరు చూస్తుంటేనే తెలుస్తోంది.. ఆమె వేదన అంతా. ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని ఘన కార్యాన్ని.. మోడీ పూర్తి చేయటాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసిపోతుంది.