కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందన్న దానిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. సెలవు మీద వెళ్లిన రాహుల్.. నిజంగా సెలవు మీద వెళ్లారా? అసలు సెలవు మీద వెళ్లాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆ అనుమానాల్ని బలపరిచే వ్యాఖ్యలు తాజాగా వెలువడ్డాయి.
సెలవు మీద వెళ్లిన రాహుల్.. సెలవు నుంచి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడతారన్న ప్రచారం ఓ పక్క జోరుగా సాగుతుంటే.. మరోపక్క సోనియమ్మకు అనుంగ శిష్యుగణం మాత్రం అందుకు భిన్నమైన వాదనలు చేయటం గమనార్హం.మొన్నామధ్య యువరాజు సెలవుపై మాట్లాడిన డిగ్గీరాజా రేపిన కలకలం ఇంకా సర్దుకోక మునుపే తాజాగా పంజాబ్‌కు చెందిన సీనియర్‌నేత.. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పగ్గాలను చేపట్టేందుకు యువనేత రాహుల్‌గాంధీ మరికొంత కాలం వేచి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పగ్గాలు ప్రస్తుతం సోనియమ్మచేతుల్లో ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేజిక్కించుకునే ముందు.. రాజకీయంగా మంచి అనుభవం గడించాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దేశ ప్రజలకు మరింత సన్నిహితం కావాలని సూచించారు.
చెప్పా పెట్టకుండా సెలవు మీద వెళ్లే యువరాజు దేశ ప్రజలకు సన్నిహితం ఎలా అవుతారన్న ప్రశ్న అడగకుండానే.. ఎంత గొప్పగా సెలవిచ్చారో చూశారా? యువరాజుకు పగ్గాలు అప్పజెప్పటం అంత సులువైన పని కాదన్న విషయంపై ఒక క్లారిటీ వస్తోంది. అయినా.. ఉన్న ఫళంగా సీనియర్లను చాప చుట్టేసి పార్టీ నుంచి విసిరేయటం ఖాయమంటూ రాహుల్ వర్గం ధీమాగా మాట్లాడుతుంటే.. సీనియర్లు చేతులు ముడుచుకొని కూర్చుంటారా ఏమిటి..?