ప్రధాని మోడీని అడుగడుగునా వ్యతిరేకించే కాంగ్రెస్ అధినేత్రి తొలిసారి మోడీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో నరేంద్ర మోడీ సర్కార్ కు తాము అండగా ఉంటామని ఆమె ప్రకటించారు. తాజా దాడుల ద్వారా పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయిందని ఆమె హర్షం వ్యక్తంచేశారు. భారత్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల బాధ్యత పాకిస్థాన్ దేనని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని చెప్పిన ఆమె ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, తమ దేశంలో ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించడానికి పాకిస్థాన్ ఇకనైనా చరమగీతం పాడాలని సూచించారు.
పాక్ లోకి ప్రవేశించి భారత సైన్యం 38 మంది ఉగ్రవాదులను హతమార్చిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాయంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలూ ప్రభుత్వానికి అండగా నిలిచాయి. భారత సైన్యం చేసిన సాహసానికి అఖిల పక్షం అభినందనలు తెలిపింది.
ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశిస్తున్న తీరు - వాటిపై తీసుకుంటున్న చర్యలను రాజ్ నాథ్ సింగ్ అన్ని పార్టీల నేతలకి వివరించారు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రతి అడుగుకు తమ మద్దతు ఉంటుందని వారు హామీ ఇవ్వడంతో మోడీ సర్కారుకు మరింత ఉత్సాహం వచ్చినట్లయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/