కాంగ్రెస్ .. వందేళ్ళకి పైగా రాజకీయ చరిత్ర కలిగిన సుదీర్ఘమైన అనుభవం కలిగిన పార్టీ. కానీ అదంతా కూడా గతం. కేంద్రం లో రెండుసార్లు వరుసగా ఘోర పరాజయాన్ని అందుకుంది. అలాగే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉందన్న సంగతి కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది అగస్టులో కాంగ్రెస్‌కి చెందిన 23 మంది సీనియర్లు పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన అవసరమని పేర్కొంటూ సోనియాకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖపై అప్పట్లో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీనియర్ల లేఖ తెరపైకి వచ్చిన దాదాపు 4 నెలల తర్వాత సోనియా గాంధీ వారితో సమావేశం నిర్వహించబోతుంది. దీనితో ఈ భేటీ పై ఆసక్తి పెరిగిపోతుంది.
పార్టీకి తాత్కాలిక అధ్యక్షులు కాకుండా పూర్తి కాలపు అధ్యక్షుడు ఉండాలని నాలుగు నెలల క్రితం రాసిన లేఖలో సీనియర్లు అభిప్రాయపడ్డారు. అలాగే పార్టీలో ఏఐసీసీ,సీడబ్ల్యూసీ సహా అన్ని స్థాయిల్లోని పదవులకు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలో ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అసమ్మతి నేతలతో సోనియా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి పార్టీ కీలక నేతలు గులాం నబీ ఆజాద్,కపిల్ సిబల్,మనీష్ తివారీ,శశి థరూర్,ఆనంద్ శర్మ,వీరప్ప మొయిలీ,పృథ్వీరాజ్ చవాన్ తదితర నేతలు హాజరు అయ్యారని తెలుస్తుంది.
అసమ్మతి నేతలతో పాటు మన్మోహన్ సింగ్,పి.చిదంబరం,అశోక్ గెహ్లాట్ తదితర సీనియర్ నేతలతోనూ సోనియా మంతనాలు జరపనున్నారు. అయితే కాంగ్రెస్ కీలక నేతలు మాత్రం సోనియా ప్రత్యేకించి రెబల్స్ తో సమావేశం కావట్లేదని... పార్టీ సీనియర్లందరితో సమావేశం అవుతున్నారని స్పష్టం చేశారు. ఈ మధ్య బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా పతనం కావడం,హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పూర్తిగా గల్లంతవడం,కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంపై సోనియా గాంధీ పార్టీ సీనియర్లతో చర్చించే అవకాశం ఉంది. అలాగే రైతుల ఆందోళనలపై చర్చించనున్నారు. ఇక పార్టీలో నాయకత్వ ప్రక్షాళనకు సంబంధించి కూడా కీలక చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.