ఓఎల్ ఎక్స్...ఆన్ లైన్ వివిధ రకాల వస్తువుల అమ్మకానికి - కొనుగోలుకు పాపులర్ సైట్. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వస్తువులకు అయితే కేరాఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు మాత్రం ఓఎల్ ఎక్స్ వేదికగా పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆశ్చర్యపోకండి. ఇది నిజం. అమ్మకాలంటే మామూలుగా కూడా కాదు...లాభాలు ఆర్జించే స్థాయికి ఆ బిజినెస్ చేరిపోయింది. ఇప్పటి వరకు వస్తువుల అమ్మకాలు - కొనుగోళ్లు మాత్రమే ఓఎల్ ఎక్స్ లో జరుగుతున్న దాంట్లో ఇదో కొత్త పరిణామం అన్నమాట.
పశువులను కొనాలంటే వారాంతపు సంతలకు లేదా పశువులున్న ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆలోచించిన హర్యానాలోని సోనిపేట్ కు చెందిన రాకేష్ ఖత్రీ అనే రైతు ఓఎల్ ఎక్స్ ద్వారా పశువుల అమ్మకాలు - కొనుగోళ్లు చేసి మంచి లాభాలు పొందుతున్నాడు. ఇప్పటి వరకు 25 ఆవులను - బర్రెలను అమ్మి రూ. లక్ష లాభం వెనకేసుకున్నాడు. గత నాలుగు నెలల నుంచి పశువులను ఓఎల్ ఎక్స్ ద్వారా అమ్ముతున్నట్లు ఖత్రీ తెలిపాడు. తన ప్రకటనను ఓఎల్ ఎక్స్ లో చూసి వ్యాపారులు ఇంటి వద్దకే వచ్చి పశువులను కొంటున్నారని చెప్పాడు. దీంతో వారాంతపు సంతలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని తద్వారా ఇటు సమయం - అటు రవాణా చార్జీలు మిగిలిపోతున్నాయని ఖుష్ అయ్యాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/