కరోనా కష్ట కాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆపన్నులను ఆదుకొని రియల్ హీరో అయ్యాడు. లాక్ డౌన్ సమయంలో రైతులు, కూలీల కోసం ట్రైన్లు, బస్సులు ఏర్పాటు చేసి మరీ వారిని ఊర్లకు చేర్చారు. ఇప్పటికీ కూడా సోనూసూద్ తన ఫాండేషన్ ద్వారా సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై ఇప్పటివరకూ సోనూసూద్ స్వయంగా స్పందించలేదు. కానీ తాజాగా సోనూసూద్ తన సోదరి రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. సోనూసూద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.
తన సోదరి మాళవిక సూద్ వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు తెలిపారు. అయితే ఆమె ఏ పార్టీ తరుఫున పోటీచేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. ఇక సోనూ ఇటీవల పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీతో భేటి అయ్యారు. అదే విధంగా సోనూసూద్ ఢిల్లీ సీఎం క్రేజీవాల్ తో కూడా సమావేశమయ్యారు.
ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ‘దేశ్ కా మెంటర్స్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్టు సోనూసూద్ పేర్కొన్నారు. అయితే ఆయన పలు పార్టీ నేతలు, సీఎంలను కలిసినప్పటికీ ప్రధానంగా తన ఫౌండేషన్ కు రాజకీయాలతో సంబంధం లేదన్నారు.
సోనూసూద్ గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటి కావడం వల్ల పంజాబ్ ఎన్నికల్లో చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే సోనూసూద్ మాత్రం ఈ వార్తలను ఖండించారు. తాజాగా తన సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీచేస్తుందని ప్రకటించడంతో ఆమె ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్నది ప్రస్తుత రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.