ఐదు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించటం తెలిసిందే. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా అభివర్ణిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ప్రాధమిక షెడ్యూల్ ను వెల్లడించటం తెలిసిందే. దీంతో.. ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది. ఇదిలాఉంటే.. తాజాగా పంజాబ్ రాజకీయాల్లో కొత్త సందడి చోటు చేసుకుంది.
కరోనా వేళ.. అనూహ్యంగా ప్రజల మీద పడిన లాక్ డౌన్ ను ఎదుర్కొనే విషయంలో కష్టాల బారిన పడిన సామాన్యుల్ని ఆదుకోవటంతో పాటు.. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కోట్లాది రూపాయిల్ని వెచ్చించిన సినీ నటుడు సోనూసూద్.. రియల్ హీరోగా మారటం తెలిసిందే. తెర మీద విలన్ పాత్రలు పోషించే సోనూ.. రియల్ లైఫ్ లో మాత్రం రీల్ హీరోకు ఏ మాత్రం తగ్గని రీతిలో స్పందించటం.. కష్టంలో ఉన్న వారు సాయం కోసం చేయి చాచాలే కానీ..వారి సమస్యను పరిష్కరించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరగటమే కాదు.. ప్రజల గుండెల్లోఒక అరుదైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెబుతున్న ఆమె.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తొలుత ఆమె ఇంటికి పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వెళ్లారు. అక్కడ వారితో చర్చలు జరిపారు. అనంతరం ఆమెను.. రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ.. సిద్ధూ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ పరిణామం పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది.
వాస్తవానికి గత నవంబరులోనే తాను పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతానని మాళవిక సూద్ ప్రకటించటం తెలిసిందే. తన మాటలకు తగ్గట్లే..తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సెలబ్రిటీలతో ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్.. త్వరలోనే క్రికెటర్ హర్భజన్ సింగ్ ను కూడా తమ పార్టీలోకి తీసుకొస్తారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. పంజాబ్ రాజకీయాల్లో తారల తళుకులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సోనూ సోదరి పొలిటికల్ ఎంట్రీ ఉందని చెప్పక తప్పదు.