ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ ఎలా పుట్టింది? ఎక్కడ నుంచి ఉద్భవించింది..? ఇదీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా.. జరుగుతున్న చర్చ. గతంలో కరోనా.. డెల్టా.. వంటి వేరియెంట్లు వచ్చాయి. అయితే వాటి వ్యాప్తి కన్నా కూడా ఒమిక్రాన్ వంద రెట్ల వేగంతో విస్తరిస్తున్న విషయం తెలిసిందే. టీకా తీసుకున్న వారిలోనూ ఇన్‌ఫెక్షన్ వస్తోంది. దీంతో ఒమిక్రాన్ భయం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది.
వాస్తవానికి బలహీనపడిన కరోనా వైరస్ ఉన్నఫళంగా ఒమిక్రాన్‌గా ఎలా రూపాంతరం చెందింది? అనేది మిలియన్ డార్ల ప్రశ్నగా ఉంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్ మూలాల్లో హెచ్‌ఐవీ ఉంది అని ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అంటే.. ఒమిక్రాన్‌లో ఎయిడ్స్ లక్షణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి..పలు దేశాల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ సంయుక్త నియంత్రణ కార్యక్రమం 'యూఎన్‌ఎయిడ్స్' నిరుడు ఓ నివేదిక ఇచ్చింది.
దక్షిణాఫ్రికాలో 18-45 ఏళ్ల వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్‌ఐవీకి గురయ్యారు. ప్రపంచ హెచ్‌ఐవీ కేంద్రంగా ఆ దేశం మారిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ వైరస్ సోకినవారిలో 30% పైగా మంది అసలు యాంటీరిట్రోవైరల్ డ్రగ్స్‌ని తీసుకోవడమే లేదని వివరించింది. హెచ్‌ఐవీ సోకినా ఎలాంటి మం దులు వాడనివారి రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనపడి, ఇతరత్రా వ్యాధులకు ఆలవాలంగా మారుతుం ది.
సరిగ్గా ఇలాంటి మహిళే కరోనా బారిన పడిందని, ఆమె శరీరంలోని హెచ్‌ఐవీ వైరస్ కారణంగా కరోనా ఉత్ప రివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి ఉంటుందని పరిశోధకులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన డా.కెంప్ బృందం కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. హెచ్‌ఐవీ వైరస్ తిష్ఠవేసిన శరీరంలో కరోనా విజృంభించడానికి చాలా అనువైన పరిస్థితులుంటాయి. దక్షిణాఫ్రికాలో హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అక్కడే ఒమిక్రాన్‌గా అవతరించి ఉండొచ్చు అని కెంప్ వివరించారు.
దీంతో అప్పట్లో కరోనా.. చైనాలో పుట్టి ప్రపంచాన్ని ఒణికిస్తే.. ఇప్పుడు ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో పుట్టి.. ప్రపంచానికి సవాలు రువ్వుతోంది. అయితే.. దీనివల్ల మరణ శాతం తక్కువగా ఉండడం.. వ్యాక్సిన్ ప్రభావం పనిచేయడం వంటివి ఒకింత ప్రపంచం.. ఊపిరి పీల్చుకునే పరిణామాలని చెప్పుకోవచ్చు.