కరోనా వ్యాప్తికి నేనే కారణం.. క్షమించండి

Update: 2020-03-04 09:30 GMT
అంతర్జాతీయంతో పాటు దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా.. కరోనా.. అనే మాటలే వినిపిస్తున్నాయి. భారతదేశంలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా 21మందికి భారతదేశంలో కరోనా వైరస్ బాధితులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 12 మంది మనదేశానికి చెందిన వారు కాదు. ఇతర దేశానికి చెందిన పర్యాటకులు. భారతదేశంలో ఇంతవరకు వైరస్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వలన సోకింది. మినహా భారతదేశంలో ఆ వైరస్ వ్యాప్తి చెందలేదు.. చెందదు కూడా. భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఆ వైరస్ వ్యాప్తి చెందేందుకు ప్రతికూలంగా ఉన్నాయి. దీంతో ఎవరూ ఆందోళన చెందొద్దని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. మన దేశం కన్నా ఇతర దేశాల్లో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. అయితే ఈ వైరస్ వ్యాప్తి తాను కారణంగా భావించి ఓ మత పెద్ద ఏకంగా ప్రణమిల్లి నమస్కారం చేసి దేశ ప్రజలకు క్షమాపణ కోరాడు. ఈ పరిణామం దక్షిణ కొరియా లో చోటుచేసుకుంది.

దక్షిణకొరియాలో తనను తాను భగవత్ స్వరూపుడి గా ప్రకటించుకున్న లీ మాన్ హీ ఓ చర్చిని ఏర్పాటు చేశాడు. ఆ ఓ చర్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి కరోనా వైరస్ సోకిన మహిళ (61) వచ్చింది. అయితే కరోనా ఆమెకు సోకిందని తెలియక ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. కొద్ది రోజులకు చర్చికి వచ్చిన ఆమెకు కరోనా వైరస్ సోకిందని తెలిసింది. దీంతో ఆ దేశంలో కలకలం రేగింది. అప్పుడే దక్షిణకొరియాలో కరోనా వ్యాప్తి మొదలైంది. దీంతో చర్చి నిర్వాహకుడికి కూడా కరోనా సోకి ఉంటుందని ప్రభుత్వం వైద్య పరీక్షలకు పిలిచింది. అయితే ఆయన పరీక్షలు చేయించుకోవడానికి ఆసక్తి చూపలేదు. వెంటనే పరీక్షలు చేసుకోకుంటే అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అందులో నెగటివ్ అని తేలడం తో ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.

అయితే తాను చర్చిలో ఆమెకు ప్రవేశం కల్పించడం తోనే దేశంలో కరోనా విస్తరించిందని గుర్తించి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తన వల్లనే దేశంలో కరోనా వ్యాపించిందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ప్రజలకు క్షమాపణ కోరాడు. ఈ సందర్భం గా తల నేలకు తగిలించి రెండు చేతులు పెట్టి నమస్కారం పెట్టి నన్ను క్షమించండి అని కోరాడు.
Tags:    

Similar News